wright
-
అమెరికా ఇంధన మంత్రిగా క్రిస్ రైట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా ఇంధన శాఖ మంత్రిగా క్రిస్ రైట్ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టంప్ర్నకు క్రిస్ రైట్ భారీగా విరాళాలు అందజేశారు. ఆయన ప్రచారానికి సహకరించారు. డెన్వర్‌లోని లిబర్టీ ఎనర్జీ అనే సంస్థకు క్రిస్ రైట్ సీఈఓగా పని చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. చమురు, గ్యాస్ ఉత్పత్తకి గట్టి మద్దతుదారుడు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు.కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రపంచమంతా శిలాజేతర ఇంధన వనరుల వైపు పరుగులు తీస్తుండగా, ట్రంప్ మాత్రం శిలాజ ఇంధనాలకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇంధన మంత్రిగా క్రిసరైట్ను నియమించడంతో అమెరికా శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరగాలని క్రిస్ రైట్ వాదిస్తున్నారు. ఆయన గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఆయనకు లేదు. క్రిస్ రైట్ను ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్ నియమించడం వెనుక అమెరికాలోని చమురు లాబీ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా రైట్
ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ డేమియన్ రైట్ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అండర్ –19 క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రైట్ పేర్కొన్నాడు. రైట్ గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్టు హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్–2021 సీజన్ ఏప్రిల్ 9న మొదలవుతుంది. -
భయాందోళనలు కలిగిస్తున్న వింత జంతువు
స్కాట్లాండ్: మునుపెన్నడూ కనిపించని ఓ వింత జంతువు స్కాట్లాండ్లోని ఓ గ్రామ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తోంది. స్కాటిష్ ఫీల్డ్‌లలో ఈ జంతువు కనిపించడంతో జిమ్మీ రైట్(66) అనే వ్యక్తి దాన్ని కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అది ఏంటో అర్ధంకాక సగటు నెటిజన్ తల పట్టుకుంటున్నాడు. కొందరు అది తాబేలు జాతికి చెందిందై ఉంటుందని పేర్కొనగా.. మరికొందరు అది మాంసాహారేమోనని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ జంతువును రైట్.. స్కాట్లాండ్లో గల పశ్చిమ స్టిర్లింగ్‌షైర్‌లోని కెల్లెర్న్ గ్రామంలో చూశాడు. తన కొడుకు పెంచుకుంటున్న కుక్కను బయటకు తీసుకెళ్లిన సమయంలో వింత జంతువు కౌ ఫీల్డ్‌లో దర్జాగా నడుచుకుంటూ వెళ్లడాన్ని ఫోటో తీశాడు. తొలుత ఆ జీవిని తాను షాక్‌కు గురయ్యానని రైట్ అన్నారు. డైనోసార్‌ను అది పోలి ఉండటంతో భయమేసిందని చెప్పారు. వెంటనే ఆ ప్రాంతం నుంచి ఇంటికి వచ్చేసినట్లు వెల్లడించారు.