ఐపీఎల్ 2011లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్, నాటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ పాల్ వాల్తాటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల వాల్తాటి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ ద్వారా పంపాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన వాల్తాటి 2011 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు క్రికెట్ ఫాలోయర్స్‌కు వాల్తాటి అంటే ఎవరో కూడా తెలీదు.
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాల్తాటి 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌తో రాత్రిరాత్రి హీరో అయిపోయిన వాల్తాటి, ఆతర్వాత మరో రెండు సీజన్ల వరకు (2013) ఐపీఎల్ ఆడాడు. అనంతరం యువ ఆటగాళ్ల ఎంట్రీతో క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు.
ఐపీఎల్ కెరీర్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన వాల్తాటి సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 505 పరుగులు చేశాడు. కెరీర్ ఆరంభంలో ఇండియా అండర్-19, ఇండియా బ్లూ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించిన వాల్తాటి.. 2006 తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు వలస వెళ్లి, అక్కడ ఫస్ట్‌క్లాస్ కెరీర్ ప్రారంభించాడు.
కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి..
న్యూజిలాండ్‌లో జరిగిన 2002 అండర్ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్ వాల్తాటి కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపట్టాడు. బంగ్లా బౌలర్ సంధించిన షార్ట్ పిచ్ డెలివరీ నేరుగా వాల్తాటి కంటిపై బలంగా తాకింది. ఆ ఘటన తర్వాత వాల్తాటి చాలాకాలం పాటు కంటికి బ్యాండ్ ఎయిడ్ కట్టుకుని కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment