Punjab Kings-XI
-
ఐపీఎల్లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్
ఐపీఎల్ 2011లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్, నాటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ పాల్ వాల్తాటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల వాల్తాటి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ ద్వారా పంపాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన వాల్తాటి 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు క్రికెట్ ఫాలోయర్స్‌కు వాల్తాటి అంటే ఎవరో కూడా తెలీదు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాల్తాటి 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌తో రాత్రిరాత్రి హీరో అయిపోయిన వాల్తాటి, ఆతర్వాత మరో రెండు సీజన్ల వరకు (2013) ఐపీఎల్ ఆడాడు. అనంతరం యువ ఆటగాళ్ల ఎంట్రీతో క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో 23 మ్యాచ్‌లు ఆడిన వాల్తాటి సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 505 పరుగులు చేశాడు. కెరీర్ ఆరంభంలో ఇండియా అండర్-19, ఇండియా బ్లూ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించిన వాల్తాటి.. 2006 తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు వలస వెళ్లి, అక్కడ ఫస్ట్‌క్లాస్ కెరీర్ ప్రారంభించాడు. కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి.. న్యూజిలాండ్‌లో జరిగిన 2002 అండర్ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్ వాల్తాటి కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపట్టాడు. బంగ్లా బౌలర్ సంధించిన షార్ట్ పిచ్ డెలివరీ నేరుగా వాల్తాటి కంటిపై బలంగా తాకింది. ఆ ఘటన తర్వాత వాల్తాటి చాలాకాలం పాటు కంటికి బ్యాండ్ ఎయిడ్ కట్టుకుని కనిపించాడు. -
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా రైట్
ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ డేమియన్ రైట్ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అండర్ –19 క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రైట్ పేర్కొన్నాడు. రైట్ గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్టు హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్–2021 సీజన్ ఏప్రిల్ 9న మొదలవుతుంది. -
పరాజయం పిలిచింది...
మ్యాచ్‌లో విజయానికి 17 బంతుల్లో 21 పరుగులు కావాలి... చేతిలో 9 వికెట్లు ఉన్నాయి...ఇలాంటి స్థితిలో ఎంత బలహీన జట్టయినా గెలుపును అందుకుంటుంది. కానీ అలా చేయగలిగితే అది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎందుకవుతుంది.. గత మ్యాచ్‌లాగే పేలవ బ్యాటింగ్‌లో తడబడిన టీమ్ చివరకు 18 పరుగులు మాత్రమే చేసి ఓట మిని ఆహ్వానించింది. మరోసారి అతి జాగ్రత్తకు పోయిన కెప్టెన్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నా, పంజా బ్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో మెరుపు ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో కూడా ప్రత్యేకత కనబర్చడంతో నైట్‌రైడర్స్ చివరి క్షణాల్లో మరో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి బంతికి సిక్సర్ కొడితే స్కోరు సమమయ్యే అవకాశం ఉండగా మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్ బౌండరీకి రెండంగుళాలు ముందు పడి ఫోర్‌గా మారడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అబుదాబి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ సత్తా చాటింది. శనివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 74; 6 ఫోర్లు), మయాంక్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. సూపర్ కార్తీక్ పవర్ ప్లేలో 25/1... 10 ఓవర్లలో 60/2... 15 ఓవర్లకు 101/3. ఈ స్కోరు చూస్తే ఎవరికైనా కోల్‌కతా ఇన్నింగ్స్ ఎంత నెమ్మదిగా సాగిందో అర్థమవుతోంది. 150 పరుగులు దాటితే అదే గొప్ప అని భావించారంతా. కానీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ధాటికి చివరి 30 బంతుల్లో 63 పరుగులు సాధించిన కోల్‌కతా ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కార్తీక్ ఆటే హైలైట్. గత మ్యాచ్ హీరో రాహుల్ త్రిపాఠి (4), రాణా (2), మోర్గాన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), రసెల్ (5) వేగంగా పరుగులు చేయడంలో విఫలమైన వేళ.. కార్తీక్ స్వేచ్ఛగా ఆడాడు. జట్టు స్కోరు 63/3 వద్ద క్రీజులోకి వచ్చిన అతను... అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌కు అవకాశమిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో గిల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు అర్‡్షదీప్ వేసిన 16వ ఓవర్లో మూడు బౌండరీలతో కార్తీక్ దూకుడు పెంచాడు. అదే ఊపులో వరుసగా 4, 6, 4 బాది జోర్డాన్ బౌలింగ్‌లో 18 పరుగులు రాబట్టాడు. షమీ వేసిన మరుసటి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదిన కార్తీక్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. వెంటనే గిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మారని తీరు... మొదట్లో ప్రశాంతంగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో బోల్తా కొట్టింది. ఎలాగైనా జట్టును గెలిపించేందుకు బరిలోకి దిగిన రాహుల్ రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. మరోవైపు మయాంక్ ధాటిగా ఆడాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో సిక్స్‌తో సహా రెండు ఫోర్లు బాదిన మయాంక్... కమలేశ్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో జోరు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో రాహుల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ అందుకోగా... మయాంక్ 33 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు.తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మయాంక్ ఔటయ్యాడు. చేతిలో ఇంకా 9 వికెట్లుండటంతో పంజాబ్ విజయం దాదాపు ఖాయంగానే తోచింది. కానీ తర్వాతే ఇన్నింగ్స్ తడబడింది. నరైన్ బంతికి పూరన్ (16) క్లీన్‌బౌల్డ్ కావడంతో పతనం ప్రారంభమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (బి) షమీ 4; గిల్ (రనౌట్) 57; రాణా (రనౌట్) 2; మోర్గాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బిష్ణోయ్ 24; కార్తీక్ (రనౌట్) 58; రసెల్ (సి) ప్రభ్ సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 5; కమిన్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–12, 2–14, 3–63, 4–145, 5–150, 6–164. బౌలింగ్: షమీ 4–0–30–1, అర్‡్షదీప్ 4–1–25–1, జోర్డాన్ 4–0–37–0, ముజీబ్ 4–0–44–0, బిష్ణోయ్ 4–0–25–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసిధ్ 74; మయాంక్ (సి) గిల్ (బి) ప్రసి«ధ్ 56; పూరన్ (బి) నరైన్ 16; ప్రభ్ సిమ్రన్ (సి) రాణా (బి) ప్రసిధ్ 4; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 10; మన్దీప్ (సి) (సబ్) గ్రీన్ (బి) నరైన్ 0; జోర్డాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–115, 2–144, 3–149, 4–151, 5–158. బౌలింగ్: కమిన్స్ 4–0–29–0, ప్రసి«ధ్ 4–0–29–3, కమలేశ్ 3–0–40–0, వరుణ్ 4–0–27–0, నరైన్ 4–0–28–2, రాణా 1–0–7–0. నరైన్ బౌలింగ్‌పై సందేహాలు! కోల్‌కతా జట్టుకు కొత్త సమస్య వచ్చి పడింది! పంజాబ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. అతని బౌలింగ్ సందేహాస్పదంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అతనిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఐపీఎల్లో నరైన్ బౌలింగ్‌ను కొనసాగించవచ్చని, మరో సారి యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తే సస్పెండ్ చేస్తామని గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. -
నేడు మోహాలి వేదికగా పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్
-
ప్రీతి జింటాకు బాగా కోపమొచ్చేసింది!
మొహాలి : ప్రీతి జింటాది నలుగురితో కలివిడిగా ఉండే తత్వం. మైదానంలో నవ్వులు రువ్వుతూ.. నిత్యం సంతోషంగా కనిపిస్తారామె. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ఆమె తమ జట్టు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా.. అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ జట్టు సభ్యులను ఉత్సాహ పరుస్తుంటారు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ప్రీతి ఉత్సాహంగా కనిపించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ అద్భుతంగా ఆడి ఐపీఎల్లో కెరీర్ బెస్ట్ అయిన 79 పరుగులు చేసి.. నాటౌట్‌గా ఉన్నప్పటికీ చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో ధోనీ వీరోచితంగా ఆడుతున్నంతసేపు మైదానంలో ప్రీతి ఒకింత డల్‌గా కనిపించారు. మొదట క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడి.. చెన్నైకి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ధోనీ ఆటతీరుతో చెన్నై జట్టు లక్ష్యం దిశగా సాగడం ఆమెలో కొంత టెన్షన్ రేపినట్టు కనిపించింది. కానీ, చివరకు పంజాబ్ జట్టు గెలుపొందడంతో ప్రీతి ఆనంద డొలికల్లో తేలియాడింది. గెలిచిన అనంతరం ఆమె మైదానంలోని అభిమానులకు కింగ్స్ ఎలెవన్ జట్టు టీ షర్ట్‌లను పంచింది. ఈ సందర్భంగా ప్రీతి ఒక్కసారిగా సహనం కోల్పోయినట్టు కనిపించింది. ప్రేక్షకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి. కోపంతో కొందరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం.. ప్రేక్షకులకు ఆమెకు మధ్య కొంత వాగ్వాదం నడవడం వీడియోలో కనిపించింది. వెంటనే నార్మల్ అయిపోయిన ప్రీతి మళ్లీ యథావిధిగా అభిమానులకు టీషర్ట్లు పంచింది. అయితే, టీషర్ట్‌ల కోసం అభిమానులు ఎగబడటంతో చిన్నారులు కిందపడి నలిగిపోయే పరిస్థితి ఎదురైందని, అందుకే చిన్నారులకు ఇబ్బంది కలుగకుండా చూడాలంటూ ప్రేక్షకులను ఉద్దేశించి పేర్కొన్నట్టు ప్రీతి ట్విటర్లో వివరణ ఇచ్చారు. -
పంజాబ్‌దే పై చేయి
-
పంజాబ్‌దే పై చేయి
ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ 24 పరుగులతో చెన్నైపై విజయం సెహ్వాగ్ సూపర్ సెంచరీ రైనా అద్భుత పోరాటం వృథా ఆదివారం కోల్‌కతాతో తుదిపోరు అద్భుతం...మహాద్భుతం...20 ఓవర్ల ఆటలో ప్రేక్షకులకు అపరిమిత ఆనందం... బ్యాట్స్‌మెన్ వీర విహారం ముందు బౌలర్లకు చుక్కలు కనిపించాయి. గెలుపోటముల తేడా 24 పరుగులే కనిపిస్తున్నా వాస్తవానికి జరిగిన పోరాటం వేరు. ఈ సీజన్‌కే ది బెస్ట్ అనదగ్గ ఆటను చూపిస్తూ ఆ రెండు జట్లు మరో సారి విధ్వంసాన్ని సృష్టించాయి. తొలుత వీర విహారంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేస్తే, తామేమీ తక్కువ కాదంటూ చెన్నై ఆఖరి వరకూ పోరాడింది. ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డ పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్ ముందు సూపర్ కింగ్స్ తలవంచింది. సెహ్వాగ్ సూపర్ సెంచరీ, రైనా అసాధారణ ఆట ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేశాయి. సీజన్ ఆసాంతం సంచలన విజయాలతో దూసుకుపోయిన బెయిలీ బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లాగే ఇదీ సంపూర్ణ వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 428 పరుగులు నమోదు కావడం విశేషం. ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో సారి జూలు విదిల్చింది. అద్భుత ప్రదర్శనతో తొలి సారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. ధోని (31 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది. సెహ్వాగ్ దూకుడు... తొలి ఓవర్‌నుంచే సెహ్వాగ్, వోహ్రా జోరు ప్రదర్శించారు. చెన్నై బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో పవర్ ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా...9.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. 21 బంతుల్లో సెహ్వాగ్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే వీరూ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. అర్ధ సెంచరీ తర్వాత అతను మరింత వేగంగా దూసుకుపోయాడు. మిల్లర్ అండగా నిలవడంతో 50 బంతుల్లో సెహ్వాగ్ ఐపీఎల్లో రెండో సెంచరీని అందుకున్నాడు. వీరూ వెనుదిరిగాక బెయిలీ (1), మిల్లర్, సాహా (6) తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. ఆకాశమే హద్దుగా... అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రెండో బంతికే డు ప్లెసిస్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ ఆనందం పంజాబ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సురేశ్ రైనా అత్యద్భుతమైన ఆటతో చెన్నై ఇన్నింగ్స్‌ను ఆకాశంలో నిలబెట్టాడు. మరో వైపు స్మిత్ (7) విఫలమయ్యాడు. అవానా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రైనా రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు (ఒక నోబాల్) కొట్టాడు. ఈ ఓవర్లో ఏకంగా 33 పరుగులు వచ్చాయి. రైనా రనౌట్ అయ్యాక... జడేజా జడేజా (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) , ధోని కొద్దిసేపు పోరాడినా... పంజాబ్ పట్టు విడవలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) డు ప్లెసిస్ (బి) నెహ్రా 122; వోహ్రా (సి) రైనా (బి) పాండే 34; మ్యాక్స్‌వెల్ (సి) రైనా (బి) అశ్విన్ 13; మిల్లర్ (రనౌట్) 38; బెయిలీ (బి) నెహ్రా 1; సాహా (సి) స్మిత్ (బి) మోహిత్ 6; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1-110; 2-148; 3-211; 4-218; 5-225; 6-226. బౌలింగ్: నెహ్రా 4-0-51-2; పాండే 4-0-35-1; మోహిత్ 4-0-46-1; అశ్విన్ 4-0-44-1; జడేజా 4-0-48-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) సందీప్ 7; డు ప్లెసిస్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 0; రైనా (రనౌట్) 87; మెకల్లమ్ (రనౌట్) 11; జడేజా (సి) జాన్సన్ (బి) అవానా 27; డేవిడ్ హస్సీ (సి) సెహ్వాగ్ (బి) అవానా 1; ధోని (నాటౌట్) 42; అశ్విన్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 10; మోహిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1-1; 2-67; 3-100; 4-140; 5-140; 6-142; 7-167. బౌలింగ్: జాన్సన్ 4-0-44-1; సందీప్ శర్మ 3-0-32-1; అవానా 4-0-59-2; కరణ్వీర్ 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-4-0; అక్షర్ పటేల్ 4-0-23-1. టర్నింగ్ పాయింట్... పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై స్కోరు 100 పరుగులు. అందులో రైనా ఒక్కడే 87 చేశాడు. మ్యాచ్ పంజాబ్‌నుంచి చేజారుతున్నట్లే అనిపించింది. ఈ దశలో ఏడో ఓవర్ తొలి బంతిని కవర్స్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించిన మెకల్లమ్ కాస్త సంకోచించినా...మరో ఎండ్‌లో ఉన్న రైనా పరుగు పూర్తి చేసుకోగలననే విశ్వాసంతో మెకల్లమ్‌ను పిలిచాడు. అయితే చురుగ్గా స్పందించి బెయిలీ విసిరిన త్రో నేరుగా స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను తగిలింది. రైనా డైవ్ చేసినా లాభం లేకపోయింది. ఈ రనౌట్‌తోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆర్యా... సంతోషమేనా! ‘ఎందుకు డాడీ.. ఊరికే అవుట్ అవుతున్నావు? మీ డాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్లో నా స్నేహితులు ఏడిపిస్తున్నారు’ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్‌కు ఫోన్ చేసిన అతని కొడుకు ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చిన్నా బాధపడకు... కచ్చితంగా నేను భారీ స్కోరు చేస్తా’ అని సమాధానం చెప్పిన వీరూ... చెన్నైతో కీలక మ్యాచ్‌లో పెను విధ్వసం సృష్టించి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. అంతేకాదు... పంజాబ్ జట్టు ఓనర్లలో ఒకరైన నెస్ వాడియాకు మరచిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. వీరేంద్రుడి విశ్వరూపం వీరేంద్ర సెహ్వాగ్ యుద్ధం ప్రకటించాడు..! ప్రత్యర్థిగా ఉన్న చెన్నై జట్టు బౌలర్లపైనా...తనను లెక్కే చేయని ఢిల్లీ జట్టు యాజమాన్యంపైనా...మాజీ సహచరుడు గంభీర్‌కు భారత జట్టులో చోటిచ్చి తనను కనీసం పట్టించుకోని సెలక్టర్లపైనా...వీరూ వీరావేశానికి స్ఫూర్తినిచ్చిన కారణం ఏదైనా కావచ్చు. కానీ చాన్నాళ్ల తర్వాత తనలోని అసలైన ఆటను బయట పెట్టాడు. మ్యాక్స్‌వెల్, పొలార్డ్, పఠాన్, అండర్సన్‌ల మత్తులో ఉన్న ఐపీఎల్ అభిమానులకు తానేంటో మళ్లీ గుర్తు చేశాడు. తానెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూనే వీరందరికీ విధ్వంసక ఆటలో తానే ‘బాప్’నని రుజువు చేసుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. తనకు అలవాటైన రీతిలో తొలి బంతిని బౌండరీతో వీరూ ఆరంభించలేదు. కానీ ఆ తర్వాత అతని బ్యాట్ పదునెక్కింది. కవర్స్, పాయింట్, థర్డ్మ్యాన్ల దిశగా అద్భుతమైన టైమింగ్‌తో ఫోర్లు కొట్టిన వీరూ...తన ఫేవరేట్ అప్పర్ కట్‌తో సిక్సర్ల ఖాతా తెరిచాడు. నెహ్రా బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మూడు ఫోర్లు క్లాసిక్‌గా కనిపించాయి. వీరూ వేగానికి జడేజా పెద్ద బాధితుడయ్యాడు. అతను వేసిన 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు రాబట్టాడు! గత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైనసెహ్వాగ్ ఈ సీజన్లోనూ ఆరంభంలో అంతంతే అనిపించాడు. చాలా ఇన్నింగ్స్‌లో మెరుపు ఆరంభం చేస్తున్నా అది చివరి వరకు కొనసాగలేదు. అయితే కటక్‌లో కోల్‌కతాపై అర్ధ సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత ఆరు ఇన్నింగ్స్ మళ్లీ తిరోగమనం వైపే వెళ్లాయి. అయితే శుక్రవారం ఇన్నింగ్స్‌తో అతను ఐపీఎల్లో రెండో సారి ‘సెంచరీ పంచ్’ విసిరాడు. ఎన్ని మారినా...ఎందరు ‘విలయకారులు’ వచ్చినా తన తర్వాతే అనే ఆనందం, ఆత్మవిశ్వాసం ఆ అద్దాల మాటున కనిపించింది. అన్నట్లు... కింగ్స్ ఎలెవన్ టీ షర్ట్ వేసుకొని వీరూ జోరుకు చప్పట్లతో ఊగిపోయిన అర్జున్ టెండూల్కర్‌ని చూస్తే తెలుస్తుంది ఈ ఇన్నింగ్స్‌పై సెహ్వాగ్ అభిమానుల స్పందన ఏమిటో! -
మ్యాక్స్ వెల్ వీర బాదుడు, పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
అబుదాబి: ఐపీఎల్-7లో అసలు మజా మొదలయింది. భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు పంజాబ్ ఎలెవన్ కింగ్స్ షాకిచ్చింది. ఆరు వికెట్ల తేడాతో ధోని సేనను ఓడించింది. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో చెన్నైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లను మ్యాక్స్ వెల్ ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో వీర బాదుడు బాదాడు. మ్యాక్స్ వెల్ విజృంభణతో 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. ఏడు బంతులు మిగులుండగానే పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్ వెల్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించాడు. 43 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మిల్లర్(54) అర్థ సెంచరీతో రాణించాడు. పూజారా 13, సెహ్వాగ్ 19, బెయిలీ 13 పరుగులు చేశారు. అశ్విన్ 2 వికెట్లు తీశాడు, నెహ్రా, స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. స్మిత్(66), మెక్ కల్లమ్(67) అర్థ సెంచరీలు చేశారు. రైనా 24, ధోని 26 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో బాలజీ 2 వికెట్లు పడగొట్టాడు. ఏఆర్ పటేల్, ఆవానా చెరో వికెట్ తీశారు. మ్యాక్స్ వెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద' మ్యాచ్ దక్కింది. -
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్!
బాలీవుడ్ తార ప్రీతి జింటాకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. పలుమార్లు కోర్టు ఆదేశించినప్పటికి హాజరకాకపోవడంతో ప్రీతి జింటాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రితీ జింటా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టు హాజరుకాకపోవడంతో వారెంట్ ను చండీగడ్ కోర్టు జారీ చేసింది. ఇటీవల బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరమై.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు ప్రీతి జింటా ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే!