ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆండర్సన్ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్‌ను ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా నియమించింది. తన చివరి టెస్ట్ ముగిసిన వెంటనే ఆండర్సన్ కొత్త బాధ్యతలు చేపడతాడు.
ఇంగ్లండ్.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్‌లు మొదలవుతాయి. లార్డ్స్, ట్రెంట్‌బ్రిడ్జ్, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లార్డ్స్‌లో జరుగబోయే టెస్ట్‌తో ఆండర్సన్ రిటైర్ కానున్నాడు. ఆండర్సన్ బౌలింగ్ మెంటార్‌గా తన ప్రస్తానాన్ని విండీస్‌తో రెండో టెస్ట్ నుంచి మొదలుపెడతాడు.
జట్ల వివరాలు..
ఇంగ్లండ్ (తొలి రెండు టెస్ట్‌లకు): హ్యారీ బ్రూక్, జో రూట్, డేనియల్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్, జేమ్స్ ఆండర్సన్ (తొలి టెస్ట్‌కు మాత్రమే), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డిల్లన్ పెన్నింగ్టన్, మ్యాట్ పాట్స్
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కవెమ్ హాడ్జ్, అలిక్ అథనాజ్, జకరీ మెక్‌క్యాస్కీ, జేసన్ హోల్డర్, కిర్క్ మెక్‌కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్ ఇమ్లాక్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, మిఖైల్ లూయిస్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జెర్మియా లూయిస్
Comments
Please login to add a commentAdd a comment