టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియమించింది.
కరేబియన్ దీవులలో ఈ మెగా ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో బ్రావో సేవలను ఉపయెగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణయించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది.
సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ పనిచేస్తున్నాడు.
40 ఏళ్ల బ్రావోకు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్‌లో కూడా అపారమైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవరాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు.
టీ20 క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర.
అంతేకాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జట్లు టైటిల్స్‌ను సాధించడంలోనూ బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ జట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment