త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియాకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. 51 ఏళ్ల బహుతులే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్నాడు. లంక పర్యటనకు రెగ్యులర్ బౌలింగ్ కోచ్ లేకపోవడంతో బీసీసీఐ బహుతులేను తాత్కాలిక ప్రతిపదికన ఎంపిక చేసింది.
బహుతులే.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కటే, టి దిలీప్‌లతో కలిసి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత కోచింగ్ శిబిరంలో జాయిన్ అవుతాడు. బహుతులే.. 1997-2003 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బహుతులే టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు ఆడాడు.
కాగా, టీమిండియా.. శ్రీలంక పర్యటన ఈనెల 27 నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గంభీర్ భారత హెడ్ కోచ్‌గా తన ప్రస్తానాన్ని మొదలుపెడతాడు. గంభీర్ కోచింగ్ టీమ్‌లో దిలీప్ తప్పించి మిగతా వారంతా కొత్తవారే.
భారత రెగ్యులర్ బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి. అయితే మోర్కెల్ వ్యక్తిగత కారణాల చేత లంక టూర్‌కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాటు చేసింది. మోర్కెల్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సమయానికి అందుబాటులోకి రావచ్చు.
ఇదిలా ఉంటే, లంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు పల్లెకెలె.. వన్డేలకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇదివరకే ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డే టీమ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment