టీమిండియాతో టీ20 సిరీస్‌.. జింబాబ్వే క్రికెట్‌ కీలక నిర్ణయం | Charl Langeveldt appointed as bowling coach of Zimbabwe | Sakshi

IND vs ZIM: టీమిండియాతో టీ20 సిరీస్‌.. జింబాబ్వే క్రికెట్‌ కీలక నిర్ణయం

Jul 5 2024 3:11 PM | Updated on Jul 5 2024 3:21 PM

Charl Langeveldt appointed as bowling coach of Zimbabwe

స్వదేశంలో టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు జింబాబ్వే అన్ని విధాల సిద్దమైంది. జూలై 5(శనివారం) హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

తమ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా మాజీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ చార్ల్ లాంగెవెల్ట్‌ను జింబాబ్వే క్రికెట్‌ నియమించింది. లాంగేవెల్ట్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

ఇప్పుడు లాంగేవెల్ట్‌ జింబాబ్వే ప్రధాన కోచ్‌ జస్టిన్ సామన్స్, అసిస్టెంట్ కోచ్ డియోన్ ఇబ్రహీమ్‌లతో కలిసి పనిచేయనున్నాడు. కాగా జస్టిన్ సామన్స్, డియోన్ ఇబ్రహీమ్‌లను కూడా ఇటీవలే జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. 

ఈ సిరీస్‌తోనే జింబాబ్వే పురుషల జట్టు కోచ్‌లగా వీరి ముగ్గరి ప్రయాణం ప్రారంభం కానుంది. జింబాబ్వే మాజీ బ్యాటర్‌ స్టువర్ట్ మట్సికెన్యేరి ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నాడు.

జింబాబ్వేతో తొలి రెండు టీ20ల‌కు భారత జట్టు
శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌) , హర్షిత్ రాణా

భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే జట్టు
సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్‌డ్ మైక్‌ర్‌స్రాబానీ, డి. మిల్టన్ శుంబా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement