న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ జేకబ్ ఓరమ్ ఎంపికయ్యాడు. ఓరమ్ అక్టోబర్ 7 నుంచి బాధ్యతలు చేపడతాడు. న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ పదవి 2023 నవంబర్ నుంచి ఖాళీగా ఉంది. అప్పట్లో షేన్ జర్గెన్సన్ న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఓరమ్ 2018-2022 మధ్య న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. గత కొంతకాలంగా అతను న్యూజిలాండ్ మెన్స్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.
46 ఏళ్ల ఓరమ్ 2014లో కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పట్లో అతను న్యూజిలాండ్-ఏ టీమ్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. ఓరమ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను సూపర్ స్మాష్‌లో సెంట్రల్ హిండ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓరమ్ న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్వాగతించాడు.
ఆటగాడిగా, కోచ్‌గా ఓరమ్ అనుభవం న్యూజిలాండ్ జట్టుకు చాలా ఉపయోగపడుతుందని అన్నాడు. ఓరమ్ నూతన బాధ్యతలను భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి చేపడతాడు. అక్టోబర్ 16 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఓరమ్ 2001-2012 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 33 టెస్ట్‌లు, 160 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. ఓరమ్ ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీల తరఫున 18 మ్యాచ్‌లు ఆడాడు.
ఓరమ్ టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 6 అర్ద సెంచరీలు.. వన్డేల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో 60 వికెట్లు, వన్డేల్లో 173 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment