సహాయ సిబ్బందిని ఎంపిక చేసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ కావాలని బీసీసీఐతో ముందే ఒప్పందం చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తాజాగా తన సపోర్టింగ్ స్టాఫ్ లిస్ట్‌లో కొత్త పేరును చేర్చాడు. సహాయ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, టెన్ డస్కటే.. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేర్లను ఇదివరకే ప్రతిపాదించిన గంభీర్.. బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ పేరును కొత్తగా తెరపైకి తెచ్చాడు.
మోర్నీ మోర్కెల్ గతంలో గంభీర్‌తో కలిసి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి పని చేశాడు. ఈ సాన్నిహిత్యంతోనే గంభీర్ మోర్నీ పేరును ప్రతిపాదించి ఉండవచ్చు. మోర్నీకి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఇదిలా ఉంటే, గంభీర్ ఎంపికల విషయంలో బీసీసీఐ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. సహాయ సిబ్బందిగా భారతీయులనే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ ముగ్గురు విదేశీ కోచ్‌ల పేర్లను ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ.. గంభీర్ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.
గంభీర్ ప్రతిపాదనలను అటుంచితే.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోర్నీ కాకపోతే బౌలింగ్ కోచ్‌లుగా లక్షీపతి బాలాజీ, వినయ్ కుమార్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని గంభీర్ కోరినట్లు తెలుస్తుంది. గంభీర్ ప్రతిపాదనలు.. సొంత ఛాయిసెస్ నడుమ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment