బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న (జులై 16) సెలెక్షన్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేయబోయే భారత జట్టుపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
లంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని సమాచారం. తొలుత ఈ సిరీస్‌లో రోహిత్ ఆడడని ప్రచారం జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు లంకతో వన్డేలకు కోహ్లి, బుమ్రా అందుబాటులో ఉండడం లేదన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. వీరిద్దరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో ముఖ్య అంశాలు..
రోహిత్ అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఈ సిరీస్‌తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది.
హార్దిక్ పాండ్యా కేవలం టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది.
భారత టీ20 కెప్టెన్సీ రేసులో పాండ్యాతో పాటు సూర్యకుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా, శ్రీలంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌లో వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment