సచిన్, ధోనీ వెరీ వెరీ లక్కీ! | BCCI chief slams Sandip Patil for secrests of Sachin and dhoni | Sakshi
Sakshi News home page

సచిన్, ధోనీ వెరీ వెరీ లక్కీ!

Published Tue, Sep 27 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

సచిన్, ధోనీ వెరీ వెరీ లక్కీ!

సచిన్, ధోనీ వెరీ వెరీ లక్కీ!

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ పై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జట్టుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు, విషయాలను ఇటీవల పాటిల్ వెల్లడించడాన్ని ఠాకూర్ జీర్ణించుకోలేక పోతున్నారు. అందులోనూ భారత క్రికెట్లో దిగ్గజంగా పేరున్న సచిన్ టెండూల్కర్, సక్సెస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు గతంలో సంబంధించిన పలు రహస్యాలను పాటిల్ వెల్లడించాడు. భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ధోనిని ఆ పదవి నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందని గత వారం పాటిల్ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.

కొత్తవారికి కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేయాలని భావించామని అయితే.. కీలకమైన 2015 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఆ సాహసం చేయలేకపోయామని వివరణ కూడా ఇచ్చాడు. సచిన్ ఎవరి సలహాలు పాటించకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడని, అయితే వాస్తవానికి అతడు రిటైర్మెంట్ ప్రకటించికపోతే ఆ సమయంలో జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ ప్యానెల్ భావించిందని టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు. లేనిపక్షంలో సచిన్ అవమానకర రీతిలో ఆట నుంచి తప్పుకునేవాడు. బీసీసీఐతో నేరుగా సంబంధం ఉన్న సమయంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసింటే మరోలా ఉండేదని కూడా ఠాకూర్ హెచ్చరించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పాటిల్ బీసీసీఐ టాప్ సీక్రెట్స్ ను వెల్లడించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు. భవిష్యత్తులో పాటిల్ కు ఏదైనా బాధ్యత అప్పగించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement