'సచిన్ భవిష్యత్ ను నిర్ణయించడానికి నేనవ్వరిని'
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ ముగింపు పలికేందుకు నేనవ్వరినంటూ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశ్నించాడు. సచిన్ తో రిటైర్మెంట్ ప్రకటించడానికే వెస్టిండీస్ తో రెండు టెస్ట్ ల సిరీస్ ను ఏర్పాటు చేస్తున్నారనే ఊహాగానాల మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సచిన్ టెండూల్కర్ తో సందీప్ పాటిల్ సమావేశమయ్యారు. సచిన్ తో కలిసిన నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ సచిన్ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని ఆయన అన్నారు. సచిన్ తో కలిసేందుకు తాను ఉత్సాహం చూపుతాను. గత పది నెలలుగా సచిన్ ను కలువలేదు. కనీసం ఆయనతో మాట్లాడలేదు. ఇప్పటి వరకు తాను ఏమి మాట్లాడలేదు అని పాటిల్ అన్నారు.
సచిన్ రిటైర్మెంట్ కోసమే వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ను బీసీసీఐ ఏర్పాటు చేయడం జరిగిందని మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సచిన్ తో సందీప్ పాటిల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సచిన్ 200వ టెస్ట్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకునే విధంగా బీసీసీఐ అడుగులేస్తోంది.