Dhoni Entertainment Banners Produced LGM Movie Ready for Release - Sakshi

LGM Movie: ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ‘LGM’, తెలుగులోనూ రిలీజ్‌

Jun 16 2023 8:40 PM | Updated on Jun 16 2023 9:01 PM

Dhoni Entertainment Banners LGM Movie Ready for Release - Sakshi

‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు

ఇండియ‌న్ క్రికెట్ చరిత్రలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు గడించిన మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు.

సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌.  ఈ కార్యక్రమంలో మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న LGM చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

చదవండి: సమంత రేంజే వేరు.. సిటాడెల్‌ కోసం ఎంత పారితోషికం తీసుకుందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement