
లఢక్‌లో ధోని హల్చల్..
శ్రీనగర్ : టీం ఇండియా మాజీ కెప్టెన్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన మహేంద్ర సింగ్ ధోని లఢక్‌లో సైనికుల సమక్షంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లఢక్ కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన విషయం తెలిసిందే. బుధవారం లఢక్‌కు చేరుకున్న ధోనికి సైనిక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
సైనికులతో ఈ సందర్భంగా ధోని ముచ్చటించారు. అనంతరం ఆర్మీ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన ధోనీ రోగులతో మాట్లాడారు. అంతకుముందు ధోని ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లఢక్ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డింగ్ సహా పలు విధులు నిర్వర్తించారు. టీం ఇండియా నుంచి రెండు నెలల విరామం తీసుకున్న ధోని తాజాగా వెస్టిండీస్ టూర్‌లో ఉన్న భారత జట్టుకు దూరంగా ఉన్నారు.