ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దశాబ్దకాలంగా భారత క్రికెట్‌లో విపరీతంగా మారుమోగిన పేరు. ధోని ఎంత పెద్ద క్రికెటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఈ జార్ఘండ్ డైనమెట్ క్రికెట్‌లో రాణించినట్లుగానే రిటైర్మెంట్ తర్వాత వ్యాపారంలో అదే స్థాయిలో రాణిస్తున్నాడు. అందుకు నిదర్శనంగా మరోసారి జార్ఖండ్‌లో అతిపెద్ద పన్ను చెల్లింపుదారుడు (Tax Payer) నిలవడం.
ధోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేశారు. గత సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ రూ.13 కోట్లు డిపాజిట్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ రూ. 4 కోట్లు పెరిగింది. దీని బట్టి చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ సారి ధోనీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు అంచనా.
రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గడం లేదు..
ధోని క్రికెటర్‌గా ఉన్నప్పటి నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా బిజినెస్ వైపు దృష్టి సారించాడు. మహీ ఇప్పటికీ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఖాతా బుక్ యాప్‌కు స్పాన్సర్‌గా ఉండటంతో పాటు అందులో పెట్టుబడి కూడా పెట్టాడు. ఇటీవల బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు.
ఇది కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తుంటాడు. మీడియా నివేదికల ప్రకారం, అతను రాంచీలోని తన వ్యవసాయ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తాడు. ఇంతకు ముందు కూడా 2017-18లో జార్ఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
Comments
Please login to add a commentAdd a comment