ధోనీపై వేటా..? ఇంత అవమానమా??
రానున్న ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీపై వేటు వేసిన రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ తీరుపై మాజీ టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది చెత్త నిర్ణయమని, ధోనీని తీవ్రంగా అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు.
'నిర్ణయం తీసుకున్న తీరు, దానిని అమలుపరుచిన విధానం చెత్తగా, తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. భారత క్రికెట్ ఆణిముత్యం ధోనీ. తన 8-9 ఏళ్ల కెప్టెన్సీలో అతను అన్నింటినీ సాధించాడు. మా సొంత డబ్బుతో జట్టును నడిపిస్తున్నామని, కాబట్టి మాకు నచ్చిన నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీ అనుకొని ఉండొచ్చు. కానీ ధోనీని కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికేటప్పుడు అతని ప్రతిష్టను, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. గౌరవప్రదంగా అతనిని తప్పించి ఉంటే బాగుండేది. ఒక మాజీ క్రికెటర్‌గా ఫ్రాంచైజీ తీరు ఆగ్రహం, బాధ కలుగుతోంది' అని అజారుద్దీన్ 'ఆజ్‌తక్'తో పేర్కొన్నారు.