పుణె జట్టు పేరులో మార్పు! | After Removing MS Dhoni As Skipper, Rising Pune Supergiants Change Their Name | Sakshi
Sakshi News home page

పుణె జట్టు పేరులో మార్పు!

Published Mon, Mar 27 2017 2:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

పుణె జట్టు పేరులో మార్పు!

పుణె జట్టు పేరులో మార్పు!

న్యూఢిల్లీ:గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ..ఈ ఏడాది తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో పలు మార్పులను చేస్తోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన పుణె.. ఈసారి జట్టు పేరులో స్వల్ప మార్పులు చేసింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ లో ఎస్ అనే అక్షరాన్ని తొలగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఇక నుంచి పుణె సూపర్ జెయింట్ గానే తమ ఫ్రాంచైజీ పేరు ఉంటుందని ఆ జట్టు అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు.

'గతేడాది మా స్క్వాడ్లో నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లలో మాత్రమే సూపర్ జెయింట్ లక్షణాలను చూశాం. అయితే ఈఏడాది మొత్తం జట్టునే సూపర్ జెయింట్గా చూడాలనుకుంటున్నాం. అందుచేత 'సూపర్ జెయింట్' గా బరిలోకి దిగుతున్నాం' అని అధికారి ప్రతినిధి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement