
ధోనికి అరుదైన గౌరవం
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది.
కాన్పూర్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. భారత క్రికెట్ జట్టు 500 వ టెస్టు ఆడుతున్న నేపథ్యంలో విజ్డన్ ఆల్ టైమ్ భారత్ టెస్టు ఎలెవన్ జట్టుకు ధోని కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హేమాహేమీలతో కూడిన భారత విజ్డన్ ఆల్ టైమ్ టెస్టు జట్టును ప్రకటించారు విజ్డన్ ఆల్ టైమ్ భారత్ టెస్టు జట్టుకు ధోని కెప్టెన్గా ఎంపిక కాగా, దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లు స్థానం దక్కించుకున్నారు.
మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఉత్తమ భారత జట్టుకు కూడా ధోనినే కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించిన వేర్వేరు రెండు జట్లలో గవాస్కర్, సెహ్వాగ్లను ఓపెనర్లుగా ఎంపిక చేయగా, రాహుల్ ద్రవిడ్ కు ఫస్ట్ డౌన్ కేటాయించారు. ఆ తరువాత సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లకు వరుస స్థానాలు కేటాయించారు. దాంతో పాటు ఈ రెండు జట్లకు ఆల్ టైమ్ టెస్టు వికెట్ కీపర్గా ధోనినే ఎంపిక చేయడం మరో విశేషం.
విజ్డన్ భారత టెస్టు ఎలెవన్: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, బిషన్ సింగ్ బేడీ, మహ్మద్ అజహరుద్దీన్(12వ ఆటగాడు)
క్రికెట్ ఆస్ట్రేలియాపై భారత ఎలెవన్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్