న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్‌లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు.
గతంలో ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్‌కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్‌ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment