ధోనీ.. ఎప్పటికీ గుర్తించుకుంటాం | Sushant Singh Rajput: There's no one like Mahendra Singh Dhoni | Sakshi
Sakshi News home page

ధోనీ.. ఎప్పటికీ గుర్తించుకుంటాం

Published Thu, Jan 5 2017 3:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

ధోనీ.. ఎప్పటికీ గుర్తించుకుంటాం

ధోనీ.. ఎప్పటికీ గుర్తించుకుంటాం

ముంబై: టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్‌ పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగిన మహేంద్ర సింగ్‌ ధోనీపై బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మహీ గొప్ప కెప్టెన్‌ అని, అతని లాంటి వారు మరొకరు లేరని బాలీవుడ్‌ బయోపిక్‌ ఎంఎస్‌ ధోనీ-ద అన్‌టోల్డ్‌ స్టోరీలో టైటిల్‌ రోల్‌ పోషించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అన్నాడు. బాలీవుడ్‌ ప్రముఖులు అనుపమ్‌ ఖేర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, రణదీప్‌ హుడా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు.

టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించి, అందరూ గర్వించేలా చేసిన ధోనీకి కృతజ్ఞతలు అంటూ ఖేర్‌ ట్వీట్‌ చేశాడు. విజయాలతో భారత్‌ క్రికెట్‌కు గౌరవం తీసుకువచ్చాడని కితాబిచ్చాడు. ధోనీ అద్భుతమైన కెప్టెన్‌ అని, అతని సారథ్యంలో ప్రపంచ కప్‌లు గెలవడాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటామని ఇర్ఫాన్‌ అన్నాడు. భారత్‌ కెప్టెన్లలో గొప్ప శకం ముగిసిందని హుడా ట్వీట్‌ చేశాడు.

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్టు బుధవారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రాకపోయినా, ఎవరూ ఊహించనివిధంగా మహీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. టెస‍్టు కెప్టెన్‌ పదవి నుంచి కూడా ధోనీ ఇదే రీతిలో వైదొలిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement