తండ్రయిన స్టార్ హీరో.. పండంటి బిడ్డ పుట్టింది | Varun Dhawan Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Varun Dhawan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య

Published Tue, Jun 4 2024 11:22 AM

Varun Dhawan Blessed With Baby Girl

మరో హీరో తండ్రయ్యాడు. తాజాగా తమిళ హీరో శివకార్తికేయన్ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తండ్రి హోదాలోకి వచ్చేశాడు. ఇతడి భార్య నటాషా.. సోమవారం రాత్రి ఆడపిల్లని ప్రసవించింది. ప్రస్తుతం తల్లిబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ధ్రువీకరించారు.

(ఇదీ చదవండి: మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్)

తండ్రి డేవిడ్ ధావన్ 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత బద్లాపూర్, అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, బేడియా తదితర చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'బేబీ జాన్', 'సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి' అనే మూవీస్ చేస్తున్నాడు.

వరుణ్ ఫ్యామిలీ విషయానికొస్తే 2021లో నటాషా దలాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వరుణ్‌కి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా)

Advertisement
 
Advertisement
 
Advertisement