
Singer Aditya Narayan Reveals His Daughter Name And Meaning: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్, నటి శ్వేతా అగర్వాల్ ఝా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరిద్దరూ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ జంటకు 2022, ఫిబ్రవరి 24న ఫస్ట్ బేబీ గర్ల్ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పాప పేరును రివీల్ చేశాడు ఆదిత్య. తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్‌ను నిర్వహించాడు సింగర్ ఆదిత్య నారాయణ్. ఈ సెషన్‌లో నెటిజన్స్, అభిమానులు వివిధ రకాల ప్రశ్నలు అడగ్గా వాటికి సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తమ బేబీ గర్ల్ పేరేంటీ అని అడిగిన ఒక అభిమానికి జవాబిచ్చాడు.
చదవండి: మగబిడ్డే పుడతాడని అందరూ అనుకున్నారు.. కానీ
ఆదిత్య నారాయణ్ నిర్వహించిన ఈ సెషన్‌లో తన కుమార్తె పేరు 'ట్విష నారాయణ్ ఝా' అని వెల్లడించాడు. అలాగే మరొక అభిమాని ఆ పేరుకు అర్థమేంటీ అని అడిగారు. దీనికి 'వైభవం, మెరుపు, కాంతి, సూర్య కిరణాలు. ఈ పేరు చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్న పేరులో కూడా ఉదయించే సూర్యుడి అని అర్థం వస్తుంది. ఇక నా పేరుకి అర్థం సూర్యుడు అని. పాప పేరుకు సూర్య కిరణాలు అని అర్థం వచ్చేలా పెట్టాం. అలాగే అందులో శ్వేతా పేరు, ఆమె పూజింజే దేవుడు శివుడు కూడా ఉన్నాడు.' అని ఆదిత్య నారాయణ్ తమ కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థాన్ని వివరించాడు.