కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్‌ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్ | Bollywood Critik KRK Tweet Viral On Alia Bhatt Delivery A baby Girl | Sakshi
Sakshi News home page

KRK Tweet On Alia Bhatt: కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్‌ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్

Published Mon, Nov 7 2022 9:34 PM | Last Updated on Mon, Nov 7 2022 9:52 PM

Bollywood Critik KRK Tweet Viral On Alia Bhatt Delivery A baby Girl - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌, రణ్‌బీర్ కపూర్ దంపతులకు పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆలియా ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న రణ్‌బీర్  కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని కన్‌ఫార్మ్‌ చేశారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్‌ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. మరోవైపు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

(చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా)

 కానీ వివాదస్పద రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్కే అలియా భట్-రణ్‌బీర్‌ కపూర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఎప్పటిలాగే వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. పెళ్లయిన ఏడు నెలలకే తల్లిదండ్రులైనందుకు అలియా భట్-రణ్‌బీర్‌ కపూర్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నీకు కూడ కూతురు ఉంది కదా.. వ్యక్తిగతంగా అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మీకు నెగెటివ్ కామెంట్స్ చేయడం తప్ప.. పాజిటివ్‌గా మీరు ఆలోచించరా అని కౌంటరిస్తున్నారు. దీనిపై స్పందించిన కేఆర్కే.. 'ఎందుకు మీరంతా నాకు చెబుతున్నారు..దేశంలో లక్షల మంది ఏడు నెలలకే పుట్టినవాళ్లు ఉన్నారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ బర్త్ సర్వ సాధారణం అంటూ' తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement