దీపావళికి ముందే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది: హీరోయిన్‌ | Sushmita Sen Announce Her Brother Rajeev Sen And Charu Asopa Welcome Baby Girl | Sakshi
Sakshi News home page

Sushmitha Sen: ‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’

Published Mon, Nov 1 2021 5:58 PM | Last Updated on Mon, Nov 1 2021 6:23 PM

Sushmita Sen Announce Her Brother Rajeev Sen And Charu Asopa Welcome Baby Girl - Sakshi

ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్‌ రాజీవ్‌ సేన్‌ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ రోజు(నవంబర్‌ 1)వారికి పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ మిస్‌ ఇండియా సుస్మితా సేన్‌ సోషల్‌ మీడియాలో ప్రకటిస్తూ మురిసిపోయారు. తన సొదరుడు, మోడల్‌ రాజీవ్‌ సేన్‌- మరదలు చారు అసోపాలకు సోమవారం ఆడబిడ్డ జన్మించిందని ఆమె వెల్లడించారు. అంతేగాక తాను మేనత్తనయ్యానంటూ సుష్మితా పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఆడపిల్ల పుట్టుంది’ అంటూ బేబీ ఫొటోలను షేర్‌ చేశారు. అలాగే రాజీవ్‌, అసోపాలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోల్లో బేబీ ముఖం కనిపించకుండా సుస్మితా జాగ్రత్త పడ్డారు. సుస్మితా పోస్ట్‌కు అసోపా-రాజీవ్‌లు స్పందిస్తూ.. ‘లవ్‌ యూ దీదీ. ఎట్టకేలకు మేనత్తా ఫేవరేట్‌ వచ్చేసింది’ అంటూ అసోపా కామెంట్‌ చేయగా.. ‘నిజంగా ఇది శుభదినం, తొందరగా రండి అక్క(సుస్మితా) మేం ముగ్గురం వేయిట్‌ చేస్తున్నాం’ అంటూ రాజీవ్‌ స్పందించాడు.

చదవండి: Urmila Matondkar: నటి ఊర్మిళకు కరోనా..జాగ్రత్తగా ఉండాలని ట్వీట్‌

కాగా త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అసోపా-రాజీవ్‌లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోపా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 2019 జూన్‌లో రాజీవ్‌-అసోపాలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూలైలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఆ తర్వాత మనస్పర్థలు తొలగడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఇక బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్‌లో కూడా ప్రవేశించి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజీవ్‌ మోడల్‌గా రాణిస్తున్నాడు. 

చదవండి: ఐశ్వర్య రాయ్‌కు నవ్వు తెప్పించే సెంటిమెంట్‌ ఏంటంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement