రైలు ప్రమాదంపై స్పందించిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. రైల్వే సహాయ మంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని యూపీ డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.