రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం | trains operations cancelled due to the derailing of Patna-Indore express | Sakshi
Sakshi News home page

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

Published Sun, Nov 20 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

కాన్పూర్‌: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా ఝాన్సీ-లక్నో-కాన్పూర్‌ సహా పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆరు రైలు సర్వీసులను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కాన్పూర్‌ కు సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 91 మంది మృతి చెందగా,100 మందిపైగా గాయపడ్డారు.

సహాయక చర్యలు కొనసాగుతుండడంతో ఘటనా మార్గం గుండా వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. తుండగా-కాన్పూర్‌ మార్గంలో మూడు... కాన్పూర్‌-బండా-ఝాన్సీ మార్గంలో నాలుగు... ఝాన్సీ-బండా, మాణిక్‌ పూర్‌-అలహాబాద్‌ మార్గంలో ఐదు రైళ్లను దారి మళ్లించారు. లక్నో-ముంబై పుష్పక్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను కూడా మరో మార్గం గుండా నడుపుతున్నారు.

రద్దు చేసిన రైలు సర్వీసులు
11109 ఝాన్సీ-లక్నో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌
11110 లక్నో-ఝాన్సీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌
51803 ఝాన్సీ-కాన్పూర్‌ పాసింజర్‌
51804 కాన్పూర్‌- ఝాన్సీ పాసింజర్‌
51813 ఝాన్సీ-లక్నో పాసింజర్‌
51814 లక్నో-ఝాన్సీ పాసింజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement