ఒక్క రూపాయికే ఫ్యూరిఫైడ్ వాటర్..!
ఒక్క రూపాయికే ఫ్యూరిఫైడ్ వాటర్..!
Published Mon, Jun 6 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
న్యూఢిల్లీ : ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చాలా తక్కువ ధరకు అంటే ఒక్కరూపాయికే శుద్ది చేసిన మంచినీరు దొరకనుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ప్రయాణికులకు శుద్ధిచేసిన మంచినీటిని చవగ్గా అందించేందుకు చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చవగ్గా ఫ్యూరిఫైడ్ నీటిని అందించడానికి 'వాటర్ పాయింట్' స్టాల్స్ ఏర్పాటుచేసింది. సెవన్ స్టేజ్ ఆర్ఓ మెకానిజమ్ ద్వారా స్టాల్స్ లో ఈ వాటర్ ను అందిస్తోంది.
ప్రయాణికులు తెచ్చుకున్న బాటిల్స్ లేదా కంటైనర్లలో 300 మిల్లీలీటర్ల నీటిని కేవలం ఒక్క రూపాయే చెల్లించి నింపుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులు సొంత సీసాలు, క్యాన్లు లాంటివి తెచ్చుకోకపోయినా.. చాలా తక్కువ ధరకే స్టాల్స్ లో నీళ్లను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లోనూ, కాన్పూర్ రైల్వే స్టేషన్ లోనూ ఐఆర్‌సీటీసీ అందుబాటులో ఉంచింది. ఇది పేద, సామాన్య ప్రజలకు ఎంతో సాయపడనుందని ప్రయాణికులు అంటున్నారు.
Advertisement