Anand Vihar
-
ఢిల్లీకి తప్పిన ఉగ్ర ముప్పు! ఆయుధాలతో చిక్కిన ఆరుగురు
కోల్‌కతా: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఢిల్లీకి భారీ ఉగ్ర ముప్పు తప్పింది! ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2,000 పై చిలుకు తూటాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలావరకు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక తూటాలని తేల్చారు. నిందితులను యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన అజ్మల్ (20), రషీద్ అలియాస్ లలన్ (20), సద్దాం, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్, డెహ్రాడూన్‌కు చెందిన పరీక్షిత్ నేగిగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్ అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నట్టు అదనపు పోలీస్ కమిషనర్ విక్రంజీత్‌సింగ్, డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘‘ఆనంద్ విహార్ బస్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్టు 6న సాయంత్రం సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగి అజ్మల్ ఖాన్, రషీద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి బ్యాగుల్లో తూటాలు దొరికాయి. లక్నోకు చేర్చాల్సిందిగా వాటిని డెహ్రాడూన్‌లోని ఓ వ్యక్తి వాటిని ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. వీళ్లు గతంలో కనీసం నాలుగుసార్లు ఇలా ఆయుధాలను చేరవేసినట్టు తేలింది. వారి సమాచారం ఆధారంగా లక్నో, జౌన్పూర్ తదితర చోట్లMమిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేగి డెహ్రాడూన్‌లో ఆయుధ డెన్ నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా ఆయుధాలు, మందుగుండు చేరవేశాడు. అనుమానం రాకుండా ఆయుధ రవాణాకు ఈ ముఠా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వాడుకుంటోంది’’ అని వెల్లడించారు. ఉగ్ర కోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. మరోవైపు కోల్‌కతాలో ప్రఖ్యాత విక్టోరియా మెమోరియల్ హాల్, పరిసర ప్రాంతాలను డ్రోన్‌తో ఫొటోలు తీస్తున్న ఇద్దరు బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్షాహీకి చెందిన వారిగా గుర్తించారు. కోర్టు వారిని ఆగస్టు 23 దాకా పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్ట్ విలియంకు విక్టోరియా హాల్ కూతవేటు దూరంలోనే ఉంటుంది! పతంగులపై నిషేధం స్వాతంత్య్ర వేడుకలు జరిగే చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో సున్నిత ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ఆ పరిసరాల్లో శనివారం నుంచి సోమవారం దాకా పతంగులు, బెలూన్లు, డ్రోన్ల వంటివాటిని ఎగరేయడాన్ని నిషేధించారు. రాడార్లనూ రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రకటించిన, మొదలైన పతంగుల పోటీలు తదితరాలను ఆగస్టు 15 సాయంత్రం నుంచి నిర్వహించుకోవాలని సూచించారు. -
30 బస్కీలు తీస్తే టికెట్ ఉచితం
న్యూఢిల్లీ: ‘ఫిట్ ఇండియా’కు ప్రచారం కల్పించేందుకు భారత రైల్వే ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో 30 బస్కీలు తీస్తే ఉచితంగా ప్లాట్ఫారం టికెట్ లభించనుంది. ఈ తరహా పథకాన్ని రైల్వే శాఖ అమలు చేయడం ఇదే మొదటిసారి. ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్లో ‘స్క్వార్ట్ మెషీన్’ను అధికారులు ఏర్పాటు చేశారు. దాని ముందు 30 బస్కీలు తీస్తే చాలు ప్లాట్ఫారం టికెట్ జనరేట్ అయి ఉచితంగా లభిస్తుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్లో ‘దవా దోస్త్’ జెనరిక్ మెడికల్ షాప్‌ను కూడా రైల్వే ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందిస్తామని రైల్వే తెలిపింది. జెనరిక్ ఔషధాలను ప్రోత్సహిస్తున్న ‘దవా దోస్త్’కు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం రాజస్తాన్, ఢిల్లీలో 10 దవా దోస్త్ దుకాణాలున్నాయి. ఈ ఏడాది 100 దుకాణాలు.. వచ్చే నాలుగేళ్లలో 1,000 దుకాణాల ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. -
అలా చేస్తే ప్లాట్‌ఫాం టికెట్ ఫ్రీ!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓ మెషీన్ అటు ప్రయాణికులను, ఇటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఖర్చూ లేకుండా ఆ మెషీన్ ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్లు అందిస్తోంది. దాంతో అక్కడ ఉచిత టికెట్ల కోసం కాసింత ఒళ్లు వంచుతున్నారు. ఇంతకూ విషయమేంటంటే ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చే యంత్రాన్ని నెలకొల్పారు. ఆ యంత్రం ఎదురుగా నిలుచుని కొద్దిదసేపు సిట్ అప్స్ చేస్తే చాలు.. మెషీన్ ఉచిత ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చేస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఫిట్నెస్తో మనీ సేవ్ చేసుకోండని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఫిట్నెస్ను పోత్సహించేందుకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఒక అసాధారణ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’అని పేర్కొన్నారు. వీడియోలో ఓ వ్యక్తి మెషీన్ ఎదురుగా నిలుచుని కాసేపు సిట్ అప్స్ చేయడంతో.. అతనికి ఉచిత ప్లాట్‌ఫాం టికెట్ లభించింది. ఈ వీడియో ట్విటరటీ దృష్టిని ఆకర్షించింది. గంటల వ్యవధిలోనే అది వైరల్ అయింది. 1.5 లక్షల వ్యూస్, 29 వేల లైకులు, 10 వేల రీట్వీట్లతో అది దూసుకుపోతోంది. అద్భుతం అని కొందరు. ఫిట్‌నెస్‌పై అవగాహనకు అద్భుతమైన చొరవ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘విదేశాల్లో అమల్లో ఉన్న ఇలాంటి ప్రయోగాలు తొలిసారి భారత్‌లో ప్రవేశపెట్టారు. థాంక్యూ సర్’అని ఓ నెటిజన్ ధన్యవాదాలు చెప్పారు. -
అలా చేస్తే ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ‘కొట్టేయొచ్చు’
-
ఒక్క రూపాయికే ఫ్యూరిఫైడ్ వాటర్..!
న్యూఢిల్లీ : ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చాలా తక్కువ ధరకు అంటే ఒక్కరూపాయికే శుద్ది చేసిన మంచినీరు దొరకనుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ప్రయాణికులకు శుద్ధిచేసిన మంచినీటిని చవగ్గా అందించేందుకు చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చవగ్గా ఫ్యూరిఫైడ్ నీటిని అందించడానికి 'వాటర్ పాయింట్' స్టాల్స్ ఏర్పాటుచేసింది. సెవన్ స్టేజ్ ఆర్ఓ మెకానిజమ్ ద్వారా స్టాల్స్ లో ఈ వాటర్ ను అందిస్తోంది. ప్రయాణికులు తెచ్చుకున్న బాటిల్స్ లేదా కంటైనర్లలో 300 మిల్లీలీటర్ల నీటిని కేవలం ఒక్క రూపాయే చెల్లించి నింపుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులు సొంత సీసాలు, క్యాన్లు లాంటివి తెచ్చుకోకపోయినా.. చాలా తక్కువ ధరకే స్టాల్స్ లో నీళ్లను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లోనూ, కాన్పూర్ రైల్వే స్టేషన్ లోనూ ఐఆర్సీటీసీ అందుబాటులో ఉంచింది. ఇది పేద, సామాన్య ప్రజలకు ఎంతో సాయపడనుందని ప్రయాణికులు అంటున్నారు. -
కదులుతున్న కారులో అఘాయిత్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కదులుతున్న కారులో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్ కు వెళ్లిన బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. నిందితులు, వారు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.