రైలు ప్రమాద బాధితులకు భారీ పరిహారం! | Minister Suresh Prabhu announces exgratia for deceased families in train accident | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 20 2016 11:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఉత్తరప్రదేశ్‌లో నేటి(ఆదివారం) వేకువజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరిగిపోతుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్(రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్) రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 63 మంది చనిపోయారని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఘటన బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement