సురేశ్‌ ప్రభుకు విమానయాన శాఖ | Suresh Prabhu gets additional charge of civil aviation ministry | Sakshi
Sakshi News home page

సురేశ్‌ ప్రభుకు విమానయాన శాఖ

Published Sun, Mar 11 2018 3:39 AM | Last Updated on Sun, Mar 11 2018 3:39 AM

Suresh Prabhu gets additional charge of civil aviation ministry - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్‌ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్‌ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement