Ashoka Gajapati Raju
-
అశోక్ బంగ్లా వేదికగా మరో కుట్ర
సాక్షి, విశాఖపట్నం/విజయనగరం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచే 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వ్యూహాన్ని చంద్రబాబు రచించారని, మళ్లీ ఇప్పుడు ఆ బంగ్లా వేదికగా మరో కుట్రకు తెర లేపారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. త్వరలోనే ఆ కుట్ర బట్టబయలవుతుందని చెప్పారు. ఆదివారం ఆయన విశాఖ సర్క్యూట్ హౌస్‌లో, విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదన్నారు. అనని మాటలను పట్టుకొని చంద్రబాబు ఏడవడంతోనే ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయారని చెప్పారు. ‘బాదుడే బాదుడు’ అట్టర్ ఫ్లాప్ కావడంతో పేరు మార్చి ‘ఇదేమి ఖర్మ’ అంటూ ప్రజల్లోకి వెళ్లగా.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఖర్మ పట్టుకుందని జనం అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు సభలకు డబ్బులిచ్చి మరీ జనాన్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారని చెప్పారు. ఒక్కసారి కూడా గెలవని, ఒక్క సీటు లేని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు దాసోహమయ్యాడన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి తూట్లు పొడుస్తున్నారన్నారు. బీసీలంటే ఎప్పుడూ చంద్రబాబుకు చులకన భావమేనని, బీసీ మహిళా అధ్యక్షురాలు ఫొటో దిగడానికి వస్తే.. అశోక్ కుమార్తె అడ్డుకుంటే చూస్తూ మిన్నకుండిపోవడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. కుప్పంలో మీ సంగతి చూసుకోండి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న తాను, మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోతామని చెబుతున్న చంద్రబాబు.. ముందు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలా గెలవాలో చూసుకోవాలని కోలగట్ల హితవు పలికారు. బొబ్బిలి, రాజాం, విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సైకిల్ పోవాలంటూ ఆయన చెప్పడం ద్వారా నిజాన్ని ఒప్పుకున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు తథ్యమని చెప్పారు. -
బోడికొండపై 'దండు'యాత్ర..
సాక్షి ప్రతినిధి, విజయనగరం, నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించారు. ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. స్వయంగా ఆహ్వానించినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల వ్యయంతో రామతీర్థం ఆలయ అభివృద్ధికి సంకల్పించినట్లు మంత్రులు వెలంపల్లి, బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే రూ.3 కోట్లతో బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు రూ.కోటి వ్యయంతో దిగువనున్న రామస్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు ఉన్నప్పటికీ కూలదోసేందుకు ప్రయత్నించారన్నారు. ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులపైనా అనుచిత ప్రవర్తన తగదని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేవదాయశాఖ అధికారులు స్వయంగా ఆయన్ను కలిసి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదేనా విజ్ఞత? దేవదాయ శాఖను సర్కస్ కంపెనీ అని హేళన చేయడమేనా ఆయన విజ్ఞత? అని మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ధర్మకర్తగా ఉన్న ఆయన టీడీపీ హయాంలో ఒక్క రూపాయైనా ఆలయ అభివృద్ధికి వెచ్చించారా? అని ప్రశ్నించారు. విగ్రహాల తయారీకి విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినా ఆ బాధ్యతను టీటీడీ తీసుకున్నందున తిరస్కరించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పునర్నిర్మాణ పనులకు విరాళం ఇవ్వవచ్చని సూచించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను దోపిడీ చేసిన అశోక్ గజపతిరాజు ఆ డబ్బుతో ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఆయనది నీచమైన, క్రిమినల్ మనస్తత్వమని విమర్శించారు. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాచరికపు ఆలోచనల నుంచి బయటకు రావాలని హితవు పలికారు. గతేడాది కోదండ రామ ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయ్యాక దోషులెవరో తేలుతుందని చెప్పారు. అంగరంగ వైభవంగా.. రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు శంకుస్థాపన ఘట్టాన్ని నిర్వహించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్షేన, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, అష్టకలశ స్నపనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టి శంకుస్థాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నూతన రాతి శిలలకు పూజలు, అభిషేకాలు చేశారు. చతుర్వేదాల ఆవాహన అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 10.08 గంటలకు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన శిలా ఖండాలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు... బోడికొండ దిగువన ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాల భోగం అనంతరం యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపారు. స్వామి వెండి మండపం వద్ద నిత్యకల్యాణం, పట్టాభిషేక మహోత్సవం జరిగాయి. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రామాలయ ఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
అశోక్ గజపతిరాజు దుర్బుద్ధి బయటపడింది: బొత్స సత్యనారాయణ
సాక్షి, విజయనగరం: అశోక్ గజపతి దుర్బుద్ధి బయటపడిందని, ఆయన ప్రవర్తించిన తీరు, ఇలాంటి సంప్రదాయాలు విజయనగరం జిల్లాలో ఎప్పుడూ లేవని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రామతీర్థ ఆలయ శంకుస్థాపన కోసం ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈవో, ప్రధాన అర్చకుడిని అవమానపరిచారని తెలిపారు. ఆయనకు చైర్మన్‌గా ఆలయ అభివృద్ధి సంబంధించి బాధ్యత లేదని, అందుకోసం ఏనాడు గవర్నమెంట్‌ను కోరలేదని ధ్వజమెత్తారు. అశోక్‌గజపతి రాజు రాజరికపు అహంకారంతో ఉన్నారని, తప్పు చేసిన వారిని శ్రీరాముడు చూసుకుంటాడని చెప్పారు. ఆలయ అభివృద్ధిని అయన పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేస్తోందని బొత్స చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతి రాజుని ఆహ్వానించామని మంత్రి అన్నారు. శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేసామని.. అశోక్ గజపతిరాజు శిలాఫలకాన్ని తోసివేయడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని, ఎటువంటి అమర్యాద చేయలేదన్నారు. ఆలయధర్మకర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. -
ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర: సాక్ష్యం ఇదే!
సాక్షి, అమరావతి : మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై కుట్రలు చేసిన వారిలో ఒకరైన అశోక గజపతి.. ఆయన వర్ధంతి సందర్భంగా కొనియాడ్డం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు గారితో పాటు అశోక్ గజపతి రాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ( తెలుగు ప్రేక్షకులు బెస్ట్: నటుడు ) ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి రాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా, ఆ లేఖలో మొత్తం ఐదుగురి తెలుగు దేశం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, ఆశోక్ గజపతి రాజు, విధ్యాదర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవ రెడ్డిలను పార్టీనుంచి తొలిగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపారు. -
కుట్రకోణంపై కన్ను
సాక్షి, అమరావతి: ► విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి గత నెల 30న సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారనగా దానికి ఒక్కరోజు ముందే రామతీర్థం ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా 29న సదరు ఆలయంలో సీసీ కెమెరాను ఏర్పాటుచేస్తారనగా 28వ తేదీ రాత్రే రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ► అలాగే, రామతీర్థం వివాదాన్ని విపక్షాలు రాజేసిన మరుక్షణమే కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం వద్ద పొలాల్లోని ఆంజనేయస్వామి ఆలయంపైనున్న విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్రమత్తమైన కర్నూలు జి ల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తే అసలు విగ్రహ ధ్వంసమే జరగలేదని తేలింది. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఎస్పీ.. తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావా లతో చెలగాటమాడితే శిక్ష తప్పదని శనివారం హెచ్చరించారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలను గమనిస్తే ఆలయాల మాటున అలజడులు సృష్టించే కుట్ర బట్టబయలవుతోంది. పథకం ప్రకారమే దేవాలయాల్లో ఘటనలు జరుగుతున్నట్లు సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలూ ఇదే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీంతో రామతీర్థం ఘటన ద్వారా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి విధ్వంసం చేసే కుట్ర కోణంపైన పోలీసులు దృష్టిసారించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అశోకగజపతిరాజు చైర్మన్‌గా ఉన్న ఈ రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలిని పరిశీలించారు. డీఐజీ కేఎల్ రంగారావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల లెక్కలు తేల్చి వాటి వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టడమే కాక గత కొంతకాలంగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆయన పాలనలో ఆలయాల్లో నేరాలకూ లెక్కలేదు. తప్పుడు ప్రచారాల వెనుక వాస్తవాలివే.. మరోవైపు.. రామతీర్థం ఘటన నేపథ్యంలో డీజీపీ కార్యాలయం స్పందించింది. ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి.. ► కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి. వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి రాజశేఖర్ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ► అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. ఆలయాల విషయంలో పోలీస్ శాఖ చర్యలివీ.. ► రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు. ► ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు. ► దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు. ► రాష్ట్రంలోని అన్ని ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీసులు అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు : డీజీపీ వాస్తవాలను నిర్ధారించుకోకుండా మతాలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు. రాష్ట్రంలో ఏ ప్రార్థనా మందిరం వద్ద అయినా చిన్నపాటి ఘటన జరిగినా బాధ్యులను గుర్తిస్తున్నాం. ఇదే సమయంలో మతపరమైన అంశాలను వివాదం చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. అంతర్వేది రథం దగ్థం ఘటన అనంతరం రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టుచేశాం. ఇప్పటివరకు అన్ని మతాల ఆలయాలు, సంస్థలకు సంబంధించి 57,493 ప్రాంతాలకు జియో ట్యాగింగ్ చేశాం. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. – డీజీపీ గౌతం సవాంగ్ -
మొదటి కొచ్చిన విజయనగరం టీడీపీ లొల్లి
సాక్షి, విజయనగరం: జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. టీడీజీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మీసాల గీత మరలా తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం అని బోర్డు తగిలించారు. కాగా, అశోక్ గజపతిరాజు, మీసాల గీత మధ్య టీడీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పార్టీ కార్యాలయాన్ని ఎత్తేయాలని ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో అశోక్ వర్గానికి వ్యతిరేకంగా వారం రోజుల క్రితం ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో గీతపై అశోక్ వర్గం అమరావతిలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతిరాజు బంగ్లాకు బదులు కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు. అధిష్టానం హామీ మేరకు ఆమె బోర్డు తొలగించి వారం గడుస్తున్నా.. నూతన కార్యాలయం ఏర్పాటు జరగలేదు. అధిష్టానం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఆమె మరోమారు తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం బోర్డును ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. (చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ ) -
విజయనగరం టీడీపీలో ముదిరిన వర్గపోరు
సాక్షి, విజయనగరం: విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ కార్యకర్తలు బంగ్లా రాజకీయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై అశోక్ గజపతిరాజు, ఆయన వర్గీయులు అధిష్టానానికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం నుంచి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచిగానీ పార్టీ కార్యాలయం మూసివేయాలని ఆదేశాలు రాకపోవడంతో అశోక్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని వెలగపూడిలోనే అధినేత వద్దే తేల్చుకుందామని అశోక్ సూచనలతో నియోజకవర్గ నేతలు మంగళవారం విజయవాడకు బస్సు, కార్లలో బయలుదేరి వెళ్లారు. అధినేత అపాయింట్మెంట్ బుధవారం లభించడంతో వారు చంద్రబాబుతో భేటీ కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గీత కు అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు లోపాయికారీగా మద్దతు అందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. చదవండి: (అచ్చెన్నాయుడికి అక్కడ మాట్లాడే దమ్ముందా..?) టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడికి పరాభవం గుర్ల: తెలుగుదేశం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పరాభావం ఎదురయ్యింది. అక్రమణదారుల కు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎ దురైంది. మండలంలోని చింతలపేటలో గ్రామకంఠం భూమి సర్వే నంబర్ 34, 36లో 22 సెంట్ల భూమిని టీడీపీ నేతలు అక్రమించుకున్నారు. ఆ స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం, పాలశీతలీకరణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఆ అభివృద్ధి పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గ్రామంలో వివాదం నెలకొంది. నాగార్జున కారును అడ్డుకున్న చింతలపేట గ్రామస్తులు ఆ స్థలాన్ని అక్రమించిన అక్రమణదారులకు మద్దతు తెలిపేందుకు నాగార్జున మంగళవారం ఆ గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకు న్న గ్రామస్తులు ఆయన్ను అడ్డుకొని గ్రామంలో అభివృద్ది పనులను అడ్డుకుంటారా... పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీరెందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాసే పు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని నాగార్జునను, మండల టీడీపీ నేతలను పంపించేశారు. చదవండి: (ఈ తీర్పు అమరావతికీ వర్తిస్తుందా?!) -
కోళీకోడ్ ఘటనపై స్పందించిన అశోక్
న్యూఢిల్లీ: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాద ఘటనపై మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అన్నారు. భద్రత చాల ముఖ్యమని తెలిపారు. కోళీకోడ్ ఎయిర్ పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద విమానాలు దిగేందుకు ఎక్స్టెన్షన్ తప్పనిసరి అన్నారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) అయితే రన్ వేను ఎక్స్టెన్షన్ చేశారా.. లేదా అన్న విషయం తనకు తెలియదు అన్నారు అశోక్ గజపతిరాజు. ఎయిర్ పోర్టు, ఎయిర్‌క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు అశోక్ గజపతిరాజు. -
చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: సంచయిత
సాక్షి, విజయనగరం : మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబును నాయుడు తనను టార్గెట్ చేస్తున్నారని సంచయిత గజపతిరాజు అన్నారు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తరచూ ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మన్సాస్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. మాన్సాస్‌లో ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తన తండ్రి మరణించి (2016) నాలుగు రోజులు కూడా గడవకముందే చంద్రబాబు ప్రత్యేక జీఓ ఇచ్చి బాబాయ్ అశోక గజపతిరాజును చైర్మన్‌గా నియమించడం దారుణం కాదా అని నిలదీశారు. (మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత) సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది టీడీపీ నేతల విమర్శల నేపథ్యంలో సంచయిత గురువారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. ‘తమ కుంటుంబంపై చంద్రబాబు నాయుడతో సహా, అశోక గజపతిరాజు రాజకీయ కుట్రకు దిగుతున్నారు. మాపై వారికి ఏ మాత్రం అభిమానం ఉన్నా మా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకునేవారు. నా తండ్రి వయస్సున్న వారు నాపై తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉంది. సన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. గతంలో టీడీపీ నేతలకి నచ్చిన సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది. పురాతన మోతీ మహల్‌ని పడగొట్టడానికి రాత్రికి రాత్రే టీడీపీ హయాంలో జిఓ ఇవ్వలేదా?. విజయనగరంలో మూడు లాంతర్లు అభివృద్ది చేసే సమయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయడం సమంజసమా. దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి మహిళగా నాకు అవకాశం రావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళకి అవకాశం రాకూడదని వారు కోరుకుంటున్నారు. ఎన్డీఆర్ హయాంలోనే పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశాలు కల్పించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారేమో. ఎన్టీఆర్ వెన్నుపోటుపొడిచి వచ్చిన వారు ఆయన ఆశయాలు ఎలా కొనసాగిస్తారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజులు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మాన్సాస్ వ్యవహారాన్ని ట్రావెన్ కోర్తో ఎలా ముడిపెడతారు. మాన్సాస్, సింహాచలం దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి. చైర్ పర్సన్‌గా ప్రజలకోసం పనిచేస్తాను. శుక్రవారం నా తండ్రి దివంగత ఆనంద గజపతిరాజు 70 వ పుట్టినరోజు...అది కూడా వారికి గుర్తుండకపోవచ్చు.’ అని పేర్కొన్నారు. -
'కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని' అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ఘోర ప్రమాదం: నాడు తల్లి.. నేడు కూతురు.. కాగా మరో ట్వీట్లో.. 'రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు దేశ విద్యావ్యవస్థకే తలమానికం అవుతాయి. నాడు-నేడుతో కార్పోరేట్ స్కూళ్లను అధిగమిస్తాయి. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద పథకాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అడ్డంకులన్నీ అధిగమించి పోటీప్రపంచంలో ముందుకు దూసుకెళ్తారు పేదపిల్లలు' అంటూ పేర్కొన్నారు. 'పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు' అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్యజమెత్తారు. చదవండి: రాజధాని భూముల అక్రమాలపై సిట్ దర్యాప్తు -
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కోలగట్ల
-
కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానండి..
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానుకోండని హితవు పలికారు. చరిత్రలు చెప్పడం అందరికీ తెలుసని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు కారణంగా ఇక్కడ ప్రజలు చాలా ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల కాలం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలు జీవనాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృది జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని బొమ్మలు చూపించి చివరికి రేకుల షెడ్డులో ఉన్నతాధికారులను కూర్చొబెట్టి పాలన సాగించారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో టీడీపీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని ధ్వజమెత్తారు. -
నేడు పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం టౌన్: రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఫెస్టివల్ అధికారి ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో భానురాజా తెలిపారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ముఖ్యంగా ఒడిశా ప్రాంతం నుంచి భక్తులు లక్షలాదిగా ఈ సంబరానికి ఇప్పటికే తరలి వచ్చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విదేశీయులు సందడి చేయనున్నారు. సోమవారం తొలేళ్ల సంబరం ఘనంగా ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, భార్య సునీలా గజపతి, కుమార్తె అదితి గజపతి అమ్మవారిని దర్శించి, పట్టువస్త్రాలను సమర్పించారు. అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలన్నారు. రాత్రి 11 గంటల తర్వాత కోటశక్తికి పూజలు నిర్వహించి, అనంతరం రైతులకు విత్తనాలను పంచిపెట్టారు. సిరిమానోత్సవానికి ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, జిల్లా అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయానికే సిరిమానును, పూజారి బంటుపల్లి వెంకటరావును హుకుంపేట నుంచి ఆలయం వద్దకు ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. హుకుంపేటలో సిరిమానును ఉదయం 10 గంటల నుంచి బయలుదేరేలా చూస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చదురుగుడి వద్దకు సిరిమానుకు చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు గంటన్నర వ్యవధిలో సిరిమానుకు ఏర్పాటు చేయాల్సిన రథాన్ని, అనుసంధాన పలకలు, పూజారి కూర్చునే పీటలను అమర్చుతారు. అక్కడి నుంచి బయలుదేరిన సిరిమాను మూడుసార్లు అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు వెళ్లి కోటశక్తికి మొక్కి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
పౌర విమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : అశోక గజపతిరాజు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పౌరవిమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు నియమితులయ్యారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేనను వదిలి 2014లో సురేశ్ ప్రభు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాణిజ్య శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయనకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. -
విమానయానం మరింత చేరువ!
కొత్త నిబంధనలను ప్రతిపాదించిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా... పౌర విమానయాన నిబంధనల్లో కేంద్రం కొన్ని మార్పులను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే టికెట్ రద్దు రుసుము సహా అదనపు బ్యాగేజ్‌పై చార్జీలు తగ్గుతాయి. ప్రయాణికుల నుంచి అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలోనే కొత్త నిబంధనలు ప్రతిపాదించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు తెలిపారు. కొత్త నిబంధనలు హర్షణీయం: ఏపీఏఐ ప్రభుత్వపు కొత్త నిబంధనలపై ఏ దేశీ విమానయాన సంస్థ కూడా స్పందించకపోయినప్పటికీ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) మాత్రం వీటిని స్వాగతించింది. ‘ప్రభుత్వపు కొత్త నిబంధనలు ప్రశంసనీయం. తాజా ప్రతిపాదనలతో చాలా మందికి విమాన ప్రయాణం చేరువవుతుంది. దీంతో దేశీ విమానయాన పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది’’ అని ఏపీఏఐ ప్రెసిడెంట్ డి.సుధాకర రెడ్డి చెప్పారు. తాజా ప్రతిపాదనలు ఎయిర్‌లైన్స్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయని కేపీఎంజీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొన్నారు. ‘తక్కువ ముడిచమురు ధరలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల వంటి తదితర కారణాల వల్ల విమాన పరిశ్రమ గాడిలోకి వచ్చింది. ప్రజల ఆకాంక్షల పేరిట పరిశ్రమపై అధిక నియంత్రణలను విధిస్తే.. మళ్లీ గతంలోకి జారిపోవాల్సి రావొచ్చు’ అని హెచ్చరించారు. కొత్త నిబంధనలపై స్పందించడానికి విమానయాన సంస్థలకు కనీసం 4 వారాలైనా గడువివ్వాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిబంధనల వల్ల విమానయాన సంస్థల ఆదాయాలు తగ్గే అవకాశముందని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. డీజీసీఏ కొత్త ప్రతిపాదనల వివరాలివీ... ►విమానం ఆలస్యమై ప్రత్యామ్నాయ విమానాన్ని సిద్ధం చేయకపోతే.. అప్పుడు కంపెనీలు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ప్రయాణికులకు పరిహారం చెల్లించాలి. ప్రస్తుతం పరిహారం రూ.4,000గా ఉంది. బయలుదేరాల్సిన సమయం దాటిపోయిన తర్వాత గంటలోపు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ►విమాన సంస్థలు 15 కేజీల ఉచిత చెకిన్ బ్యాగేజ్ తర్వాత అదనపు బ్యాగే జ్‌కు సంబంధించి 20 కేజీల వరకు.. కేజీకి గరిష్టంగా రూ.100 వరకే వసూలు చేయాలి. ప్రస్తుతం సంస్థలు రూ.300 వరకు చార్జ్ చేస్తున్నాయి. ►విమానం రద్దయిన సందర్భాల్లో అన్ని చట్టబద్ధమైన పన్నులను, యూజర్ డెవలప్మెంట్ చార్జీలను, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీజులను(ఏడీఎఫ్), ప్యాసెంజర్ డెవలప్మెంట్ ఫీజులను (పీఎస్ఎఫ్) ప్రయాణికులకు తిరిగివ్వాలి. ప్రస్తుతం కంపెనీలు పీఎస్‌ఎఫ్‌ను మాత్రమే రిఫండ్ చేస్తున్నాయి. రిఫండ్‌కు ఎలాంటి అదనపు చార్జీలను తీసుకోకూడదు. ►కంపెనీల రిఫండ్‌ను దేశీ విమాన ప్రయాణానికైతే 15 రోజుల్లో, అంతర్జాతీయ ప్రయాణానికి 30 రోజుల్లోగా పూర్తికావాలి. ►విమాన ప్రయాణానికి కనీసం రెండు వారాల ముందే విమానం రద్దు విషయాన్ని ప్రయాణికులకు తెలియజేసినా, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినా కంపెనీలు ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే 2 వారాల లోపు, 24 గంటల ముందు తెలియజేసినా షరతులు వర్తిస్తాయి. ► టికెట్ రద్దు రుసుము బేసిక్ ఫెయిర్‌కు రెట్టింపు స్థాయిలో ఉండకూడదు. ►ప్రజలు, విమానయాన సంస్థలు ఈ ప్రతిపాదనలపై వారి సూచనలు, సలహాలు రెండు వారాల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం గడువునిచ్చింది. అద నపు బ్యాగే జ్‌కు సంబంధిత కొత్త నిబంధనలు జూన్ 15 నుంచి అమల్లోకి రావొచ్చని సివిల్ ఏవియేషన్ డెరైక్టర్ జనరల్ ఎం.సథియవతి తెలిపారు. కొత్త నియమాలకు విమానయాన సంస్థల నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చన్నారు. -
స్పైస్‌జెట్‌కు ఊరట
తొలగిన నెల రోజుల బుకింగ్ పరిమితి న్యూఢిల్లీ: సమస్యల్లో చిక్కుకున్న స్పైస్‌జెట్‌కు ఒకింత ఊరట లభించింది. టికెట్ల బుకింగ్‌పై విధించిన 30 రోజుల పరిమితిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తొలగించింది. వచ్చే ఏడాది మార్చి వరకూ విమాన టికెట్ల బుకింగ్‌ను నిర్వహించుకోవచ్చని డీజీసీఏ పేర్కొంది. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ సీఎఫ్ఓ ఎస్.ఎల్. నారాయణన్‌లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు, డీజీసీఏ ప్రభాత్ కుమార్‌లతో సోమవారం సమావేశం మరుసటి రోజు ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. కాగా రూ. 200 కోట్ల బకాయిలను చెల్లించడానికి కొంత వెసులుబాటును స్పైస్‌జెట్‌కు ఇస్తూ ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మరిన్ని నిధులను స్పైస్‌జెట్‌కు అందిస్తానని సన్ గ్రూప్ ప్రమోటర్లలలో ఒకరైన కళానిధి మారన్ వ్యక్తిగత పూచీకత్తు నివ్వడంతో ఏఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా స్పైస్‌జెట్‌కు రూ.600 కోట్ల మేర రుణాలివ్వమని ఆర్థిక సంస్థలను కోరతామని కూడా విమానయాన శాఖ తెలిపింది.