
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని' అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ఘోర ప్రమాదం: నాడు తల్లి.. నేడు కూతురు..
కాగా మరో ట్వీట్‌లో.. 'రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు దేశ విద్యావ్యవస్థకే తలమానికం అవుతాయి. నాడు-నేడుతో కార్పోరేట్ స్కూళ్లను అధిగమిస్తాయి. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద పథకాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అడ్డంకులన్నీ అధిగమించి పోటీప్రపంచంలో ముందుకు దూసుకెళ్తారు పేదపిల్లలు' అంటూ పేర్కొన్నారు.
'పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు' అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్యజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment