స్పైస్‌జెట్‌కు ఊరట
తొలగిన నెల రోజుల బుకింగ్ పరిమితి
న్యూఢిల్లీ: సమస్యల్లో చిక్కుకున్న స్పైస్‌జెట్‌కు ఒకింత ఊరట లభించింది. టికెట్ల బుకింగ్‌పై విధించిన 30 రోజుల పరిమితిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తొలగించింది. వచ్చే ఏడాది మార్చి వరకూ విమాన టికెట్ల బుకింగ్‌ను నిర్వహించుకోవచ్చని డీజీసీఏ పేర్కొంది. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ సీఎఫ్‌ఓ ఎస్.ఎల్. నారాయణన్‌లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు, డీజీసీఏ ప్రభాత్ కుమార్‌లతో సోమవారం సమావేశం మరుసటి రోజు ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
కాగా రూ. 200 కోట్ల బకాయిలను చెల్లించడానికి కొంత వెసులుబాటును స్పైస్‌జెట్‌కు ఇస్తూ ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మరిన్ని నిధులను స్పైస్‌జెట్‌కు అందిస్తానని సన్ గ్రూప్ ప్రమోటర్లలలో ఒకరైన కళానిధి మారన్ వ్యక్తిగత పూచీకత్తు నివ్వడంతో ఏఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా స్పైస్‌జెట్‌కు రూ.600 కోట్ల మేర రుణాలివ్వమని ఆర్థిక సంస్థలను కోరతామని కూడా విమానయాన శాఖ తెలిపింది.