లోక్‌సభలో రైల్వే మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్ వచ్చే ఐదేళ్లలో బ్రాడ్‌గేజ్‌లోకి మారనుంది. అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖకు నిధుల డిమాండ్ (డిమాండ్ ఫర్ గ్రాంట్స్)పై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు బుధవారం సమాధానమిస్తూ ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మీటర్ గేజ్ పట్టాలన్నింటిని ఐదేళ్లలో బ్రాండ్ గేజ్‌లోకి మార్చి, 2019 అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘రైల్వేలో వచ్చే ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రైల్వే నెట్‌వర్క్ భద్రతను పటిష్టం చేసేం దుకు రూ. లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు. తర్వాత సభ మూజువాణి ఓటుతో నిధుల డిమాండ్‌ను ఆమోదించింది.
పొరుగు దేశాలకు రైల్వే లైన్లు: వాణిజ్యం పెంపు, ఆసియాలో పేదరిక నిర్మూలనS కోసం పొరుగు దేశాలను రైల్వే మార్గాలతో అనుసంధానించాలని సురేశ్ ప్రభు ఢిల్లీలో జరిగిన ఐరాస సదస్సులో సూచించారు.
ఐదేళ్లలో పట్టాలన్నీ బ్రాడ్‌గేజ్‌కి
Published Thu, Mar 16 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement
Advertisement