408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం
న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం నాలుగు కొత్త సర్వీసుల్ని ప్రారంభించారు. 45 స్టేషన్లకే పరిమితమైన ఈ-కేటరింగ్ సర్వీసులను 408 స్టేషన్లకు విస్తరించామంటూ రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కేటరింగ్ విభాగంలో స్వయం సహాయక బృందాలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఈ-టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే మంత్రి ప్రారంభించారు. సరకు రవాణాను పెంచేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. గూడ్స్ రైళ్ల ప్రయాణ దూరాన్ని 400 నుంచి 600 కి.మీ.కు పెంచారు.