అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం | Araku beauty will see from the train mirrors | Sakshi
Sakshi News home page

అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం

Published Mon, Apr 17 2017 1:51 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం - Sakshi

అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం

సాక్షి, విశాఖపట్నం: ఇకపై అద్దాల రైల్లోంచి అరకు అందాలను చూడొచ్చు.  విశాఖపట్నం–అరకు మధ్య నడిచే అద్దాల (విస్టాడోమ్‌) రైలు ఆదివారం ప్రారంభమైంది. ఈ రైలును రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు భువనేశ్వర్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా జాతికి అంకితం చేశారు.  
అద్దాల రైల్లో ప్రత్యేకతలివిగో...: ఒక్కో కోచ్‌లో 40 మంది కూర్చునేలా ఉన్న ఈ రెండు ఏసీ బోగీల్లో మొత్తం 80 మంది ప్రయాణించొచ్చు. ► ఈనెల 18 వరకు ఈ రైలును ప్రయోగాత్మకంగా నడుపుతారు.
►19 నుంచి కిరండోల్‌ పాసింజర్‌కు అనుసంధానం చేస్తారు. 18వ తేదీ నుంచి టిక్కెట్ల జారీ మొదలుపెడతారు.
► విశాఖ–అరకు మధ్య టిక్కెట్టు ధర రూ.650గా నిర్ణయించారు.
► ఈ రైలులో చుట్టూ, పైభాగంలో కూడా అద్దాలు అమర్చారు.  
► కుర్చీలను 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా తిప్పుకోవచ్చు.
►ఎల్‌ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు అమర్చారు.
► జీపీఎస్‌ అనుసంధానంతో ఆటోమేటిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement