’రైల్వే పాస్‌లకు ఆధార్‌తో లింకుపెట్టం’
Published Fri, Feb 3 2017 3:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
ఢిల్లీ: రైల్వే పాస్‌లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. రైలు పాస్‌లున్న వారు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లేదంటూ ఆయన రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు మాత్రం ఏ పోర్టల్ నుంచైనా టికెట్లు బుక్ చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రైలుపాస్‌లున్న వారికి కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించే అవకాశాలను చూస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 13.30 లక్షల మంది రైల్వే శాఖ ఉద్యోగులకు పాస్‌లున్నాయని వెల్లడించారు. రైలు రద్దయిన సందర్భాల్లో టికెట్ రుసుమును వాపసు చేయటంలో కలుగుతున్న ఆలస్యాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Advertisement