పట్టాలెక్కని టెక్నాలజీ | Technology is not using in Railways | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని టెక్నాలజీ

Published Mon, Nov 21 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

పట్టాలెక్కని టెక్నాలజీ

పట్టాలెక్కని టెక్నాలజీ

- మానవ అప్రమత్తతపైనే ఆధారపడ్డ రైల్వే
- పట్టా విరిగితే ట్రాక్‌మెన్ గుర్తించాల్సిందే
- అత్యాధునిక యంత్రాలకు తీవ్ర కొరత
- పట్టాల బిగింపు, కంకర సరిచేసే టాంపింగ్ మెషీన్లూ అరకొరే
- దినదినగండంగా రైళ్ల పరుగులు
 
 సాక్షి, హైదరాబాద్: ‘రైల్వేలను లాభాల బాట పట్టించటంతోపాటు ప్రమాదరహితంగా మార్చాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ కొద్దిరోజులుగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల అధికారులను అడుగుతున్న ప్రశ్న ఇది! దీనిపై ఢిల్లీ సూరజ్‌కుండ్‌లో ఓ మేధోమథన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 18న ప్రారంభమైన ఆ సదస్సు ఆదివారమే ముగిసింది. దీని ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలు జరుగుతుండగానే.. దేశంలోనే ఘోర రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం యూపీలో చోటుచేసుకుంది!! దేశంలో సురక్షితంగా భావించే రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే ఒకటి. పట్టాలు విరగటం వల్ల ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఇక్కడ అతి తక్కువ. యూపీ ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటిని పరిశీలిస్తే...

 పట్టాలపై మరింత జాగ్రత్త
 పట్టాలు, వాటి దిగువ ఉండే సిమెంట్ స్లీపర్‌లలో తలెత్తే లోపాలను సాధారణంగా ట్రాక్‌మెన్ సులభంగానే గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ట్రాక్‌మెన్ పరిశీలించి వెళ్లిన తర్వాత రైలు వచ్చే సమయంలో పట్టా విరిగే అవకాశం ఉంది. దీన్ని నిరోధించటం కష్టంగా మారింది. పట్టా-పట్టాను జోడించే చోట ఉండే జారుుంట్లు ప్రమాదకరంగా మారుతున్నారుు. అలాంటి చోట్ల వెల్డింగ్ చేస్తారు. ఒక్కోసారి ఈ వెల్డింగ్ జారుుంట్లు ఊడిపోరుు పట్టాలు పక్కకు జరిగి రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. ట్రాక్‌మెన్ అప్రమత్తతో వీటిని గుర్తించొచ్చు. కానీ జారుుంట్లలో చిన్న పగుళ్లను వారు గుర్తించటం కష్టమవుతోంది. ఈ పగుళ్లను కూడా గుర్తించేందుకు ప్రత్యేకంగా కొన్ని యంత్రాలుంటారుు. అల్ట్రాసానిక్ టెస్ట్‌ల ద్వారా, రోలింగ్ ఎగ్జామినర్ల ద్వారా వాటిని గుర్తించొచ్చు. కానీ మన వద్ద వాటి వినియోగం చాలా పరిమితంగా ఉంది.

 కంకర మెషీన్ల కొరత..
 రైళ్ల వేగానికి పట్టాల దిగువన ఉన్న కంకర చెదిరిపోతుంది. ఎక్కువగా చెదిరితే అది ప్రమాదకరంగా మారుతుంది. రైలు వేగంగా దూసుకుపోతున్నప్పుడు పట్టాలు, వాటిని పట్టుకుని ఉండే స్లీపర్లపై భారం పడకుండా ఉండేందుకు ఈ కంకర కుషన్ మాదిరిగా ఉపయోగపడుతుంది. కంకర తగ్గితే పట్టాలపై భారం పడి ఏమాత్రం బలహీనంగా ఉన్నా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కంకర తగ్గితే ఆటోమేటిక్‌గా సరిచేసే టాంపింగ్ మెషీన్‌ను వినియోగిస్తారు. కానీ మన వద్ద ఆ యంత్రాలకూ కొరత ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్ వద్ద ట్యాంపింగ్ మెషీన్ డిపో ఉంది. ఇలాంటి డిపోలను మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

 వాతావరణ మార్పులూ కీలకమే..
 వాతావరణ మార్పులు కూడా పట్టాలపై ప్రభావం చూపుతారుు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వేడికి పట్టాలు వ్యాకోచిస్తారుు. చలికి సంకోచిస్తారుు. దీంతో పట్టాల జారుుంట్ల వద్ద మార్పులొస్తారుు. అందుకే జారుుంట్ల వద్ద కొంత గ్యాప్ ఉంచుతారు. చలి పెరిగితే సంకోచం వల్ల ఈ గ్యాప్ మరీ ఎక్కువై చక్రం పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. దీన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. పట్టా జారుుంట్లు, వెల్డింగ్‌లను పరిశీలించేందుకు ప్రతి మూడు నెలలకోమారు వెల్డింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి కావాల్సినన్ని అల్ట్రా సోనిక్ పోర్టబుల్ యంత్రాలు మరిన్ని సమకూర్చుకోవాల్సి ఉంది.

 విద్రోహ చర్యలు.. దేవుడిపైనే భారం
 రెండు పట్టాల మధ్య దూరం నిర్ధారిత ప్రమాణంలో ఉండాలి. ఇందుకోసం వాటిని దిగువ ఉండే కాంక్రీట్ స్లీపర్లతో కట్టి ఉంచుతారు. బలమైన ఇనుప కడ్డీతో ఈ బంధం ఉంటుంది. కానీ విద్రోహులు వాటికి ఉండే బోల్టులు తొలగిస్తున్నారు. అప్పుడు పట్టా పక్కకు జరిగి బోగీలు పట్టాలు తప్పుతారుు. విద్రోహులు వాటిని విప్పదీయకుండా ఉండే వ్యవస్థ అందుబాటులో లేదు.
 
 భారమంతా ట్రాక్‌మెన్‌పైనే...
 నిరంతరం పట్టాలపై గస్తీ తిరిగే ట్రాక్‌మెన్‌ను నమ్ముకునే రైళ్లు పరుగుపెడుతున్నారుు. ప్రతి ఐదారు కిలోమీటర్ల పరిధిలో ఇద్దరు ట్రాక్‌మెన్ ఉంటారు. చెరో చివరి నుంచి పట్టాలను పరిశీలించుకుంటూ మరో చివరకు వెళ్తారు. ఏ చిన్న లోపమున్నా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తారు. వీరిపై కీ మెన్ వ్యవస్థ, వారిపై ఇన్‌చార్జిగా గ్యాంగ్‌మేట్ ఉంటారు. వారిపైన సూపర్‌వైజర్లు ఉంటారు. ప్రతి ఇరవై, ముప్‌పై స్టేషన్లకు ఓ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంటారు. ఈ వ్యవస్థలు పటిష్టంగానే ఉన్నా ఇవన్నీ మానవ అప్రమత్తతపైనే ఆధారపడుతున్నారుు. ఇందులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement