న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా పయనించే ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యంత వేగంగా నడిచే రైలు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే దీన్ని అత్యంత అధునాతనంగా రూపొందించారు. అన్నిహంగులతో పట్టాలెక్కిన ఈ రైలు ఆగ్రా-డిల్లీ మధ్య 200 కిలోమీటర్ల దూరాన్ని గంటా నలభై నిమిషాలలో కవర్ చేస్తుంది. అంటే వంద నిమిషాలలో ఆగ్రా వెళ్లిపోవచ్చు. విశేషం ఏమిటంటే ఇదే దూరాన్ని ఇదే ట్రాక్ లో పాసింజర్ రైలు ఏడున్నర గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో నడిచే టాప్ 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ మీ కోసం..
1. న్యూఢిల్లీ- భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
ఇది గంటకు 150 కి.మీ వేగంతో దూసుకెళుతుంది.
2. ముంబై- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్
ముంబై, ఢిల్లీ మధ్య నడిచే అతి వేగమైన రైళ్లలో ఇప్పటి వరకు దీనిది రెండోస్థానం
3. కాన్పూర్ - ఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్
4. న్యూఢిల్లీ హౌరా మధ్య నడిచే హౌరా రాజధాని ఎక్స్ప్రెస్
5. సెల్దా- న్యూఢిల్లీ దురంతో ఎక్స్ ప్రెస్
6. న్యూఢిల్లీ అలహా బాద్ దురంతో ఎక్స్ప్రెస్
7. హజ్రత్ నిజాముద్దీన్ -ముంబై బాంద్రా గరీబ్ రథ్ ( పూర్తి ఎయిర్ కండిషన్డ్)
దాంతో పాటు ఈ ఏడు..
Published Tue, Apr 5 2016 2:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement