super fast trains
-
గరీబ్ రథ్ ఇక సూపర్ ఫాస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆకుపచ్చ రంగు బోగీలతో పరుగులు తీసే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సరికొత్తగా ఎరుపు రంగు బోగీలతో పట్టాలెక్కడంతో పాటు శరవేగంగా పరుగులు తీయనుంది. గరీబ్ రథ్ రైళ్లకు ఇప్పటివరకు ఉన్న దశాబ్దాల నాటి ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో ఇకపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ (లింక్హాఫ్మెన్ బుష్) కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.ఎల్హెచ్బి కోచ్‌లతో కూడిన గరీబ్ రథ్ ఈ నెల 22 నుంచే సికింద్రాబాద్ నుంచి వైజాగ్మధ్య ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ ప్రెస్‌లో మొత్తం బోగీలన్నీ తృతీయ శ్రేణి ఏసీ కోచ్‌లే ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వల్ల గరీబ్‌రథ్ వేగం గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వరకు చేరుకోనుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లతో సమానంగా ఇది పరుగులు తీయనుంది. మిగతా రైళ్ల టికెట్ ధర కంటే చాలా తక్కువ గోదావరి, ఈస్ట్ కోస్ట్, విశాఖ, కోణార్క్ ఫలక్ను మా వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.1080 వరకు ఉంటుంది. కానీ సికింద్రాబాద్ నుంచి విశాఖకు గరీబ్ రథ్ థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.770 ఉంటుంది. ఇకపై ఆ రైళ్లు కూడా స్పీడ్ రైడ్: గరీబ్ రథ్ రైళ్లను ఎల్‌హెచ్‌బీలుగా మార్చనున్నట్లు రైల్వేబోర్డు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే పరిధిలో కాజీపేట్, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిచే రైలుతో పాటు వికారాబాద్, రాయ్‌చూర్ మీదుగా నడిచే సికింద్రాబాద్–యశ్వంత్ పూర్ ట్రై వీక్లీ గరీబ్ రథ్ కూడా ఎల్‌హెచ్‌బీగా మారనుంది.అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి రాకపోకలు సాగించే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – నిజాముద్దీన్, యశ్వంత్‌పూర్–విశాఖ గరీబ్‌రథ్ రైళ్లు కూడా ఎల్హెచ్బీకి మారనున్నాయి. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి మార్చారు. ఇప్పటి వరకు 90% రైళ్లు ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి మారగా, మరో 18 రైళ్లు ఐసీఎఫ్ కోచ్‌లతో నడుస్తున్నాయి. త్వరలో వీటినీ ఎల్హెచ్బీకి మార్చనున్నారు. ఈ కోచ్‌లు ఎంతో సురక్షితం⇒ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రయాణికులకు ఎంతో భద్రత ఉంటుంది. ⇒ దురదృష్టవశాత్తు రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురైనా ఈ కోచ్‌లు ఒకదానిపైకి ఒకటి రాకుండా నిలిచిపోతాయి. దీంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ఐసీఎఫ్ కోచ్‌లలో ప్రమాదాలు జరిగినప్పుడు కోచ్‌లు ఒకదానిపైకి మరొకటి చేరుతాయి. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. ⇒ అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినా వెంటనే వ్యాప్తి చెందవు. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్న రైళ్లలో ప్రాణనష్టం తక్కువగా ఉండడానికి కారణం కోచ్‌ల సామర్థ్యమేనని అధికారులు చెబుతున్నారు. -
కన్యాకుమారి ట్రైన్లో మంటలు
బరంపురం: గంజాం జిల్లా బరంపురం దగ్గర కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్ వేళ్లే సూపర్ ఫాస్ట్ రైలులో మంటలు చెలరేగాయి. ఈస్ట్–కోస్ట్ రైల్వే అధికారులు మరియు బరంపురం సబ్ కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు 10వ నంబర్ బోగీలో హటాత్తుగా మంటలు వచ్చాయి. అయితే ఆ సమయంలో లోకో ఫైలెట్ అప్రమత్తమై బండిని వెంటనే స్టేషన్ ఔటర్లో నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయాణికులను దించి, మంటలను అదుపు చేశారు. అనంతరం బండి యథావిధిగా బయల్దేరింది. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్య మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. -
వావ్!! దేశంలో మరో సూపర్ ఫాస్ట్ రైలు, ఎక్కడంటే!
దేశంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశంలో 8 కారిడార్లలలో బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఢిల్లీ - హిస్సార్ ప్రాంతాల మధ్య సూపర్ ఫాస్ట్ ట్రైన్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ - హిస్సార్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ల రైలు మార్గాన్ని నిర్మించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ-హిస్సార్ మధ్య 180 కి.మీ దూరాన్ని సాధారణ రైలులో నాలుగు గంటల్లో పూర్తి చేస్తుండగా..కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో అధిగమించవచ్చు. ప్రధాన కారణం ఢిల్లీ-హిస్సార్ కొత్త రైలు మార్గాన్ని నిర్మించడానికి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువే ప్రధాన కారణం. అక్కడ విమాన ట్రాఫిక్ ఉంటే, కొంత విమాన ట్రాఫిక్‌ను హిసార్ విమానాశ్రయానికి మళ్లించవచ్చు. దీని తరువాత, హిసార్ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇందులో భాగంగా సీఎం మనోహర్ లాల్‌తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు. ఈ సందర్భంగా రోహ్తక్లోని ఎలివేటెడ్ రైల్వే లైన్ కింద పది కొత్త రైల్వే స్టేషన్లతో పాటు రోడ్డు మార్గాల్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం -
దాంతో పాటు ఈ ఏడు..
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా పయనించే ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యంత వేగంగా నడిచే రైలు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే దీన్ని అత్యంత అధునాతనంగా రూపొందించారు. అన్నిహంగులతో పట్టాలెక్కిన ఈ రైలు ఆగ్రా-డిల్లీ మధ్య 200 కిలోమీటర్ల దూరాన్ని గంటా నలభై నిమిషాలలో కవర్ చేస్తుంది. అంటే వంద నిమిషాలలో ఆగ్రా వెళ్లిపోవచ్చు. విశేషం ఏమిటంటే ఇదే దూరాన్ని ఇదే ట్రాక్ లో పాసింజర్ రైలు ఏడున్నర గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో నడిచే టాప్ 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ మీ కోసం.. 1. న్యూఢిల్లీ- భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇది గంటకు 150 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. 2. ముంబై- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై, ఢిల్లీ మధ్య నడిచే అతి వేగమైన రైళ్లలో ఇప్పటి వరకు దీనిది రెండోస్థానం 3. కాన్పూర్ - ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 4. న్యూఢిల్లీ హౌరా మధ్య నడిచే హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 5. సెల్దా- న్యూఢిల్లీ దురంతో ఎక్స్ ప్రెస్ 6. న్యూఢిల్లీ అలహా బాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ 7. హజ్రత్ నిజాముద్దీన్ -ముంబై బాంద్రా గరీబ్ రథ్ ( పూర్తి ఎయిర్ కండిషన్డ్)