ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈడీబీ) ర్యాంకుల్లో తాము భారతదేశం కంటే ముందంజలో ఉన్నామని, ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం ‘రిఫామ్ కాలిక్యులస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.