cii summit
-
3 సంవత్సరాలైన పెట్టుబడులు సున్నా..
-
రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భాగస్వామ్య సదస్సులో దేశీయ, విదేశీ పారిశ్రామికవేత్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 4,253 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 50 దేశాల నుంచి 280 మంది విదేశీ ప్రతినిధిలు, 3,673 మంది దేశీయ పారిశ్రామికవేత్తలు, 30 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వరుసగా మూడవ ఏడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సోమవారం ముగిసింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో భాగస్వామ్యులు కావడానికి విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారని, ఈసారి జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ కంట్రీల సెషన్స్ జరిగాయని, వచ్చే ఏడాది శ్రీలంక, రష్యా సెషన్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఒప్పందాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సష్టించిందని సీఎం వెల్లడించారు. మూడున్నరేళ్లలో మొత్తం 1,946 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.13.54 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 31 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. వసతులు ఉపయోగించుకోండి: గవర్నర్ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ అన్ని రకాల మౌలికవసతులు ఉండటమే కాకుండా, అన్ని రకాల భద్రత ఉంటుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహన్ మాట్లాడుతూ.. హైవే, రేవులు, రోడ్డు కనెక్టివిటీతో పాటు కమ్యూనికేషన్స్, ఇంధన భద్రత పరంగా రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. -
సీఐఐ సదస్సులో మద్యంతో మజాలు
-
ఏపీ సర్కారు మరో నిర్వాకం..!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో పెటుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది. పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం, విందులు వినోదాలకు వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విశాఖలో భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా విశాఖలో అత్యంత రద్దీగా ఉండే వుడా పార్క్‌కు సమీపంలోని ఎంజీఎం పార్క్‌లో శనివారం రాత్రి మందు, విందు ఏర్పాట్లు భారీగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విందులో అతిథులను ఆకట్టుకోవడానికి ఆటపాటలను కుడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం బాలీవుడ్ నుంచి నృత్యకారిణులు, పాప్ గాయకులను పిలిపించారు. అంతేకాదు వీటితో పాటు పలు విలాసవంతమైన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను అలరించే బాధ్యతను ఈ-ఫాక్టర్ అనే సంస్థకు అప్పగించారు. గత నాలుగేళ్లుగా లక్షల కోట్ల పెట్టుబడులంటూ బాకా మోగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీకీ ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయో తెలీదు కానీ ఈ సమావేశాల పేరుతో మాత్రం ప్రజాధనాన్ని యధేచ్ఛగా ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. -
భారత్ కంటే మేమే ముందు
-
భారత్ కంటే మేమే ముందు
విశాఖపట్నం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈడీబీ) ర్యాంకుల్లో తాము భారతదేశం కంటే ముందంజలో ఉన్నామని, ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం ‘రిఫామ్ కాలిక్యులస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’అనే అంశంపై జరిగిన సెమినార్లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈడీబీ ర్యాంకుల్లో భారత్ ప్రస్తుతం 100వ స్థానంలో ఉందని, రాష్ట్రానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా చూస్తే ఏపీ 88వ ర్యాంకులో ఉంటుందన్నారు. 86.6 పాయింట్లతో న్యూజి లాండ్ మొదటి స్థానంలో ఉండగా, 60.8 పాయింట్లతో ఇండియా 100వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 63.6 పాయింట్లు వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 88వ ర్యాంకు వస్తుందన్నారు. దేశంలో తాము మొదటి స్థానంలో కొనసాగుతామని, తమకు ఇక్కడ ఎవరూ పోటీ కాదని వెల్లడించారు. ప్రపంచంలో టాప్–5 దేశాల్లో ఒకటిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్రం వేగంగా స్పందించాలి దేశీయంగా తమ ర్యాంకు మూడు నెలల్లో 64, 9 నెలల్లో 40కి చేర్చేందుకు రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈడీబీ ర్యాంకుల లెక్కింపులో ప్రధానంగా 10 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందులో 7 అంశాలు కేంద్రం పరిధిలో, 3 అంశాలు రాష్ట్రం పరిధిలో ఉంటాయన్నారు. కాబట్టి కేంద్రం వేగంగా స్పందిస్తే ర్యాంకు మరింత మెరుగవుతుందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఐఐ సదస్సులో ‘టెక్నాలజీస్ ఫర్ టుమారోస్’అనే అంశంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి: సురేష్ ప్రభు దేశంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఈడీబీలో ఇండియా ర్యాంకు మరింత మెరుగవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం సీసీఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారం అనేది సంతోషంగా చేయాలని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నియమ నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్‌ను సురేష్ ప్రభు ఆవిష్కరించారు. అనంతరం కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఎఫ్‌టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించిన ఈ–స్పైస్ బజార్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఎంపెడా’రూపొందించిన ఎన్రోల్మెంట్ కార్డులను ఆక్వా రైతులకు అందచేశారు. -
విశాఖలో రెండో రోజు సీఐఐ సదస్సు
-
విశాఖలో ముగిసిన సీఐఐ సదస్సు
-
విశాఖలో ముగిసిన సీఐఐ సదస్సు
విశాఖపట్నం: రెండు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామయ్య సదస్సు నేటితో (శనివారం) ముగిసింది. సీఐఐ సదస్సులో భాగంగా రూ.10.25 లక్షల పెట్టుబడులకు ఎంవోయులు కుదుర్చుకున్నారు. మొత్తం 665 ఒప్పందాలతో దాదాపు 22 లక్షల మందికి ఉపాధి రానున్నాయని సమాచారం. సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడిదారులతో రూ.1.29 లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు జరిగాయని అధికారులు తెలిపారు. -
ఎన్ని ఇక్కట్లు.. ఏమిటీ పాట్లు!
సాక్షి, విశాఖపట్నం: పాశ్చాత్య దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు.. స్వదేశం నుంచి అంతకు మించి పారిశ్రామిక, వాణిజ్య ప్రతినిధులు.. వీరిలో చాలామంది అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు. ఇలాటి వారికోసం ఏర్పాట్లు ఎంత సౌకర్యవంతంగా, విస్తృతంగా ఉండాలి!.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో ఆ అంశాన్ని నిర్వాహకులు, అధికారులు విస్మరించినట్టు కనిపిస్తోంది. సదస్సు కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేసిన అధికారులు మౌలిక వసతుల గురించి మరిచిపోయినట్టు అనిపిస్తోంది. కనీసం టాయిలెట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేకపోవడంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులు, ముఖ్యంగా మహిళలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. తాగునీరు, టాయిలెట్లు కొరవడ్డ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది. మహిళలకు ఒకేఒక్కటి : తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కట్టడాలను అందంగా తీర్చిదిద్దడంపై ఉన్న శ్రద్ధను అధికారులు టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయడంలో పెట్టలేదు. వచ్చిన రెండు వేలకు పైగా అతిథులకు కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసమైతే ఒకే ఒక్క చోట టాయిలెట్లు ఉన్నాయి. దీంతో రాష్ట్ర మంత్రులతో పాటు విదేశీ ప్రముఖులు కూడా టాయిలెట్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక మిగతా వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టాయిలెట్లలో గడియలు లేవు: సభ నిర్వహణలో భాగమైన కార్మికులు, జిల్లా అధికారులతో సహా అందరూ సదస్సు నుంచి బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. కార్మికులెవరినీ సదస్సు జరుగుతున్న ప్రదేశంలో టాయిలెట్లకు అనుమతించలేదు. టాయిలెట్లలో లోపలి గడియలు కూడా లేవు. దీంతో ఒకరు లోనికి వెళితే బయట ఒకరు కాపలా ఉంటున్నారు. మధ్యాహ్నం నీరు లేదంటూ దాదాపు రెండు గంటల పాటు టాయిలెట్లు మూసేశారు. మధ్యాహ్న భోజనాల సమయంలో నీరు లేకపోవడంతో అతిథులు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. గత సదస్సుతో పోల్చితే ఈ సదస్సు మరీ వెలవెలబోయింది. అసౌకర్యాల నేపథ్యంలో అతిథులు ఎక్కువ సమయం ప్రాంగణంలో ఉండలేక అతిథి గృహాలకు, నగర పర్యటనకు వెళ్లిపోవడంతో సదస్సులో హాజరు పల్చగా కనిపించింది. కనీసం అతిథులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో, వారికైమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయోనని పట్టించుకునేవారు కూడా అక్కడ ఒక్కరూ కనిపించలేదు. స్వచ్ఛ భారత్‌లో గతేడాది దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిన విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు గురయింది. -
27న విశాఖలో సీఐఐ సదస్సు
అమరావతి: రెండు రోజులపాటు విశాఖలో జరిగే భాగస్వామయ్య సదస్సును కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎల్లుండి (శుక్రవారం) జరిగే సీఐఐ సదస్సుకు మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు మంత్రులు హాజరవుతారని ఆయన వెల్లడించారు. గత ఏడాది విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 328 ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.4 లక్షల 62వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో 157 ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి కారణంగా వేలాది మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. -
అధికారులు హీనంగా చూస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: అధికారులు తమను హీనంగా చూస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తయారీ రంగంలో ఇబ్బందులు లేకుండా వ్యాపారం-పెట్టుబడులను ఏ విధంగా పెట్టాలి’ అనే అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బ్రిటీష్ హైకమిషన్(న్యూ దిల్లీ) సంయుక్తంగా బుధవారం విశాఖలో సెమినార్ నిర్వహించాయి. దీనికి హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలు రెగ్యులేటరీ అప్రూవల్స్ నిపుణుల కమిటీ చైర్మన్ అజయ్‌శంకర్‌కు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కనీస గౌరవం లభించడం లేదని, తమ సమస్యలు అధికారులు వినడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కొన్నిటిని మాత్రమే ఇస్తే వ్యాపారం ఎలా ప్రారంభించగలుగుతామని ప్రశ్నించారు. తమపై భారీగా పన్నులు విధిస్తున్నారని, దానివల్ల వ్యాపారం చేయాలంటేనే వెనకాడాల్సి వస్తోందన్నారు. పారిశ్రామికవేత్తల సూచనలను విన్న అజయ్‌శంకర్ వారి అభిప్రాయాలను పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులనూ సకాలంలో మంజూరు చేస్తామన్నారు. -
పట్టుతప్పి పడిపోబోయిన అపోలో చైర్మన్
విశాఖ: నగరంలో ఆదివారం ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సు కు హాజరైన అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కాలుజారి పడిపోబోయారు. భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో ప్రతాప్ రెడ్డి కాలు పట్టుతప్పడంతో కిందికి పడబోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను పట్టుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 'సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్వెస్టర్స్ మీట్' పేరుతో విశాఖలోని హార్బర్ పార్కు సమీపంలోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుపీయూష్ గోయల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
'తెలంగాణ నుంచి పరిశ్రమలు వెళ్లవు'
న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఐఐ సదస్సులో టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్, మ్యానుఫాక్చరింగ్ సర్వీస్ రంగాల్లో అధిక పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి పరిశ్రమలు బయటకు వెళ్లిపోవని సీఐఐ హైదరాబాద్ ఛైర్మన్ సురేష్ అన్నారు. విద్యుత్ సమస్యను తీరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన రాయితీలు, అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన సూచించారు.