27న విశాఖలో సీఐఐ సదస్సు
అమరావతి: రెండు రోజులపాటు విశాఖలో జరిగే భాగస్వామయ్య సదస్సును కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎల్లుండి (శుక్రవారం) జరిగే సీఐఐ సదస్సుకు మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు మంత్రులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.
గత ఏడాది విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 328 ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.4 లక్షల 62వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో 157 ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి కారణంగా వేలాది మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.