ఆలేరు రైల్వే గేట్ తెరవాలని రైల్వే మంత్రికి వినతి
భువనగిరి : ఆలేరు పట్టణంలో మూసివేసిన రైల్వే గేట్‌ను వెంటనే తెరిపించాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు. మంగళవారం రాత్రి ఎంపీ ఢిల్లీలో మంత్రిని కలిసి రైల్వేగేట్ మూసి వేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆర్‌ఓబీ నిర్మించి గేట్‌ను మూసి వేశారని దీంతోపట్టణం రెండుగా విడిపోయిందన్నారు. రెండు ప్రాంతాలకు కాలిబాట సౌకర్యం పూర్తిగా పోయిందన్నారు. గేట్ మూసి వేయడంతో రేషన్ సరుకులు, రోగులు, విద్యార్థులు, మహిళలు, వద్ధులు, చిన్నారులు ఇలా అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వెంటనే గేట్ తెరిపించడంతో పాటు, అర్‌యూబీని నిర్మించాలని ఎంపీ మంత్రికి విజ్ఞప్తి చేశారు.