విజయవాడ: 2015-16 సంవత్సరానికి గాను పలు విభాగాల్లో నిర్వహణ, సామర్థ్యం ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు శనివారం భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జి.ఎం రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు.
ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజినీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ అవార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో విశిష్ట సేవా అవార్డులు పి.చైతన్య (ఆపరేషన్స్ మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్), ఎం.రమేష్‌కుమార్ (గుంతకల్ డివిజన్ ఇంజినీర్), డి.జయకర్ (సీనియర్ సెక్షన్ ఇంజినీర్), ఎన్.తారకేశ్వర్ (టెక్నీషియన్ లాలాగూడ) గెజిటెడ్ విభాగంలో హరికిషోర్ (సి.సి.ఎం. కార్యదర్శి), నాన్ గెజిటెడ్ విభాగంలో ఫిరోజ్ ఫాతిమా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సిన్హా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట
Published Sun, Apr 17 2016 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM
Advertisement