Ravindra Gupta
-
విద్యార్థినులతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ చిందులు
-
చుక్ చుక్ బండి వచ్చింది!
కూ.. చుక్.. చుక్.. అంటూ గంభీరమైన శబ్దం.. దిక్కులు పిక్కటిల్లేలా కూత.. పొగమంచు కమ్మిన అనుభూతి కలిగించేలా ఆవిరి.. దట్టమైన నల్లటి పొగ.. రైలుబండి అసలు స్వరూపమిదే కదా. కానీ ఆధునిక రైలింజన్లలో ఆ శబ్దం మారింది.. పొగ మాయమైంది.. ఆవిరి ఊసే లేదు.. కానీ సాయంత్రం 6తర్వాత సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుంచి మెట్టుగూడ వైపు వెళ్తుంటే అలనాటి రైలు కూత, ఇంజన్ శబ్దం, ఆవిరి, పొగ.. అన్నింటినీ ఆస్వాదించవచ్చు. వందేళ్ల కింద పట్టాలపై పరుగు లెట్టిన రైలింజన్ దర్జాగా కొలువుదీరి.. అప్పటి ‘రైలు అనుభూతి’ని సాక్షాత్కరిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ దర్జాగా ‘సర్ అలెక్’ ఇంజన్.. నిజాం స్టేట్ రైల్వేలో తొలితరం రైలింజనే ‘సర్ అలెక్’లోకోమోటివ్. ఇంగ్లండ్‌కు చెందిన ‘కిట్సన్ అండ్ కొ’దీన్ని 1907లో రూపొందించింది. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్ నుంచి వాడీ మధ్య ప్రారం భమైన తొలి మార్గంలో ఈ ఇం జన్ పరుగుపెట్టింది. బార్సీ లైట్ రైల్వే న్యారో గేజ్ సిస్టంలో దీన్ని విని యోగించారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఇది విలీనమైంది. కొన్ని దశాబ్దాల సేవల అనంతరం దీన్ని రైల్వే సర్వీసుల నుంచి ఉప సంహరించారు. ఆ తర్వాత షెడ్డుకు పరిమిత మైంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం రైల్ నిలయం ఎదుట ఆకర్షణగా దీన్ని ఏర్పాటు చేశారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా నాలుగేళ్ల కింద పనిచేసిన రవీంద్ర గుప్తా దానికి పెయింట్ వేయించి అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అది పట్టాలపై పరుగుపెట్టే అనుభూతి కలిగించేలా మార్చారు.సాంకేతిక సమస్యలు సరిదిద్ది ఇంజన్ ఆన్ అయ్యేలా చేశారు. ముందువైపు నక్షత్రం పైన ఉండే భారీ లైటు వెలగటం, ఆ తర్వాత తొలితరం ఇంజన్ శబ్దం, కూత మొదలు కావటం, ఆ వెంటనే ఆవిరి, పొగ రావడం.. ఒక్కసారిగా కొన్ని దశాబ్దాల కిందటి రైలును కళ్లారా చూసినట్లే అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ఇంజన్ పనిచేసేలా కృత్రిమ ఏర్పాటు చేశారు. ట్రామ్ ఇంజన్ కూడా సిద్ధం.. హైదరాబాద్‌లో ట్రామ్ రైలు తిరిగిందనే విషయం కొద్దిమందికే తెలుసు. నిజాం సాక్షిగా రోడ్లపై పరుగుపెట్టిన ట్రామ్ తాలూకు ఇంజన్ కూడా ఇప్పుడు దర్జా ఒలకబోస్తోంది. జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్‌గా పిలుకునే ఇది పట్టాలపై కాకుండా రోడ్డుపై పరుగుపెట్టేది. దీనికి బస్సు తరహాలో సాధారణ టైర్లే ఉంటాయి. 1914లో రూపొందిన ఈ ఇంజన్‌కు విఖ్యాత ష్రాస్బరీ అండ్ చాలెంజర్ కంపెనీ ఒరిజినల్ టైర్లు వాడారు. ఈ టైర్లు వాడిన ట్రామ్ ఇంజన్ ఇదే కావటం విశేషం. లాలాగూడ వర్క్ షెడ్లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఇంజన్‌కు నాటి ఒరిజినల్ విడిభాగాలన్నీ అలాగే ఉన్నాయి. ఇటీవలే దాన్ని పూర్తిస్థాయిలోమరమ్మతు చేసి రంగులతో ముస్తాబు చేశారు. ఇటీవల జరిగిన రైల్వే వింటేజ్ ర్యాలీలో హొయలు ఒలకబోసి మొదటి బహుమతి గెలుచుకుంది. 1886లో తయారైన చెక్క బోగీలు, 1970 నాటి మీటర్ గేజ్ బోగీ, 1920లో బర్మింగ్‌హామ్ అండ్ వ్యాగన్ కంపెనీ సిద్ధం చేసిన బీజీ వ్యాగన్, 1925లో తయారైన 83 కిలోల బరువున్న ఇత్తడి ఫైర్ అలారమ్ బెల్ ఉన్నాయి. కాగా, వీటన్నింటినీ ప్రజలు వీక్షించే వీలు ఉంది. కానీ అందుకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అది మన వారసత్వ సంపద దక్షిణ మధ్య రైల్వే ‘మన రైల్వే ప్రారంభమైన సమయంలో ప్రజలకు సేవలందించిన ఇంజన్లు, బోగీలు, ఇతర వస్తువులను వారసత్వ ఆస్తిగా భావిస్తాం. ప్రపం చంలోనే గొప్ప రైల్వేగా ఉన్న భారతీయ రైల్వే సేవలకు ఇవి గుర్తులు.అందుకే వాటిని కాపాడి భావి తరానికి చూపేం దుకు ఈ ఏర్పాటు చేశాం.’ – సీహెచ్ రాకేశ్, సీపీఆర్ఓ -
2019కి ‘వ్యాగన్ పిరియాడికల్’ పూర్తి
డిప్యూటీ సీఎం కడియంకు రైల్వే బోర్డ్ మెంబర్ గుప్తా హామీ సాక్షి, న్యూఢిల్లీ: కాజిపేట్లో వ్యాగన్ పిరియా డికల్ ఓవరాలింగ్ యూనిట్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రైల్వే బోర్డు మెంబర్ రవీంద్ర గుప్తా హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు కడియం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతి నిధులు రామచంద్ర తేజోవత్, వేణుగోపాల చారి, ఎంపీ సీతారాం నాయక్ తదితరులు రవీంద్ర గుప్తాతో సమావేశమై రాష్ట్రంలోని వివిధ రైల్వే డిమాండ్లపై చర్చించారు. అలాగే కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్రం తరఫున 160 ఎకరాల కేటాయింపునకు సంబంధిం చిన ఉత్తర్వులను ఆయనకు అందించారు. గుప్తా స్పందిస్తూ.. రూ.300 కోట్ల నిధులతో 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు పెరుగు తున్న రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి వద్ద మూడో టెర్మినల్‌ను ఏర్పా టు చేయాలని కోరినట్టు కడియం తెలిపారు. చర్లపల్లి వద్ద కేంద్ర ప్రభు త్వానికి చెందిన భూమి ఉందని, అందులో 250 ఎకరాలను టెర్మినల్ ఏర్పాటుకు రైల్వేకు ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. ఇల్లం దుకు సింగరేణి ప్యాసింజర్ రైలును పునః ప్రారంభించాలని కోరినట్టు ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. పాండురంగపురం– సారపాకకు మధ్య 13 కిలోమీటర్ల ట్రాక్ వేస్తే భద్రాచలం దేవాలయానికి దేశవ్యాప్తంగా ప్రజలు రావడానికి అవకాశం ఉంటుందని వివరించినట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారని తెలిపారు. -
స్వర్ణోత్సవ సంరంభం దిశగా దక్షిణమధ్య రైల్వే
- 50 ఏళ్ల సందర్భంగా లోగో ఆవిష్కరణ - సేవలు చరిత్రాత్మకం జీఎం రవీంద్రగుప్తా వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు సేవలందజేస్తూ గడచిన యాభై ఏళ్లలో దక్షిణమధ్య రైల్వే అనేక చరిత్రాత్మకమైన మైలు రాళ్లను అధిగమించిందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అన్నారు. 1966 అక్టోబర్ 2వ తేదీన ఆవిర్భవించిన ద.మ.రైల్వే జోన్ వచ్చే అక్టోబర్ 2 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా స్వర్ణోత్సవ లోగోను ఆయన శుక్రవారం రైల్‌నిలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో, ప్రయాణికులకు సముచితమైన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో దక్షిణమధ్య రైల్వే అగ్రపథంలో నిలిచిందన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ై రెల్ నిలయం ఎదుట ఏర్పాటు చేసిన సర్ అలెక్ స్టీమ్ ఇంజన్ జోన్ వారసత్వ సంపదకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లకు జోన్ విస్తరించి ఉందన్నారు. ప్రయాణికులకు ‘స్వచ్ఛ’ సేవలు ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ‘స్వచ్ఛ సప్తాహ్’ లో భాగంగా అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లు, ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలి పారు. ప్లాట్‌ఫామ్‌లపై 2,751మంది, రైళ్లలో 1,591 మంది ప్రయాణికులతో పరిశుభ్రతపై మాట్లాడి సలహాలను తీసుకున్నామన్నారు. పరి సరాలను అపరిశుభ్రం చేసిన 3,764 మంది ప్రయాణికులకు రూ.7.51 లక్షల జరిమానా విధిం చినట్లు పేర్కొన్నారు. ‘స్వచ్ఛ సప్తాహ్’లో రైల్వే అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్-అమరావతి మధ్య రైల్వే లింకు
4 నెలల్లో లైన్ సర్వే పూర్తి.. రైల్వే బోర్డుకు నివేదిక - ప్రభుత్వం భూమి కేటాయించగానే కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ - త్వరలో సికింద్రాబాద్ సహా 36 స్టేషన్ల ఆధునీకరణ - ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ పొడిగింపుపై వెనకడుగు - దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ కొత్త రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి రైల్వే లింకు కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా అమరావతికి... అక్కడి నుంచి గుంటూరుకు రైళ్లను అనుసంధానించేలా కొత్త లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండేళ్ల రైల్వే పురోగతిపై బుధవారం హైదరాబాద్ రైల్ నిలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు గుప్తా తెలిపారు. నాలుగైదు నెలల్లో సర్వే పూర్తవుతుందని, వెంటనే ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపుతామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ కొత్త రాజధాని మధ్య రైలు అనుసంధానం ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 36 స్టేషన్ల ఆధునీకరణ దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలి దశలో సికింద్రాబాద్ సహా 36 స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు గుప్తా వెల్లడించారు. ఇందులో ఐదు ఏ-వన్ స్థాయి స్టేషన్లు, 31 ఏ-క్లాస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయనున్న 400 స్టేషన్లలో ఇవి భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించగానే చర్లపల్లిలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని, హైదరాబాద్‌లోని 3 ప్రధాన స్టేషన్లపై భారం తగ్గించేలా 40-50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. గత బడ్జెట్లో కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నా రు. రూ. 290 కోట్ల ప్రాథమిక అంచనాతో ఏర్పాటు చేయనున్న ఈ వర్క్‌షాపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 55 ఎకరాలే ఇచ్చిందని... మరో 150 ఎకరాలు ఇవ్వాలన్నారు. కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లు ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు గుప్తా తెలిపారు. 2 వేల అదనపు కోచ్‌లను నడుపుతామని, విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, రాయనపాడు, మధురానగర్, గుణదల, రామవరప్పాడు, విష్ణుపురం, కృష్ణా, గద్వాల్ స్టేషన్లలో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ స్టేషన్లో అదనంగా సీసీ టీవీలను, 3 ఎస్కలేటర్లను, విజయ వాడ, గద్వాల స్టేషన్లలో ఇండికేషన్ బోర్డుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కృష్ణా కెనాల్, రాయనపాడు స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జీలను నిర్మిస్తున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో అదనపు బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులకు రూ.32.68 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 7 స్టేషన్లలో తాత్కాలిక స్టాపేజీతో పాటు అలంపూర్ జోగుళాంబ స్టేషన్‌ను రెగ్యులర్ స్టాప్‌గా మార్చామన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి గత రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని గుప్త తెలిపారు. 8 స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా మార్చామని, 7 స్టేషన్ భవనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే 14 చోట్ల శుభ్రపరిచే ఆప్రాన్లు ఏర్పాటు చేశామని, 10 చోట్ల ప్లాట్‌ఫారాలను విస్తరించామని, మూడు చోట్ల వాణిజ్య అవసరాలకు వీలుగా బహుళ ప్రయోజనకర భవనాలు అభివృద్ధి చేశామని చెప్పారు. 17 కొత్త ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అమర్చామని, 28 స్టేషన్లలో 78 వాటర్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా పది రైళ్లు ప్రారంభించామని, 863 ప్రత్యేక రైళ్లు నడిపామన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ పొడిగించం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రతిపాదనను విరమించుకున్నట్లు గుప్తా చెప్పారు. ఎయిర్‌పోర్టు లో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎంఆర్ స్థలం ఇవ్వననడంతో ఆ ప్రాజెక్టు చేపట్టడం లేదన్నారు. విమానాశ్రయానికి మెట్రో రైలే అనుకూలమని భావిస్తున్నామన్నారు. 2018 నాటికి యాదాద్రికి ఎంఎంటీఎస్ హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం నిర్మించ తలపెట్టిన ఎంఎంటీఎస్ మూడో దశ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని గుప్తా వివరించారు. ఘట్కేసర్ నుంచి భువనగరి మీదుగా రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేరకు రూ. 330 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సహకరిస్తున్న దృష్ట్యా ఇది సకాలంలో పూర్తవుతుందన్నారు. -
'అమరావతి రైల్వేలైన్ కోసం త్వరలో సర్వే'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే 9 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కారాల కోసం 500 ప్రత్యేక రైళ్లు, 2000 కోచ్‌లు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రవీంద్రగుప్తా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట
విజయవాడ: 2015-16 సంవత్సరానికి గాను పలు విభాగాల్లో నిర్వహణ, సామర్థ్యం ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు శనివారం భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జి.ఎం రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజినీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ అవార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో విశిష్ట సేవా అవార్డులు పి.చైతన్య (ఆపరేషన్స్ మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్), ఎం.రమేష్‌కుమార్ (గుంతకల్ డివిజన్ ఇంజినీర్), డి.జయకర్ (సీనియర్ సెక్షన్ ఇంజినీర్), ఎన్.తారకేశ్వర్ (టెక్నీషియన్ లాలాగూడ) గెజిటెడ్ విభాగంలో హరికిషోర్ (సి.సి.ఎం. కార్యదర్శి), నాన్ గెజిటెడ్ విభాగంలో ఫిరోజ్ ఫాతిమా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సిన్హా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎంపీలతో రైల్వే జీఎం భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా బుధవారం సమావేశమయ్యారు. రానున్న రైల్వే బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ట్రిపుల్ రైల్వే లైన్ వేయాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద స్టేషన్ ఏర్పాటుచేయాలని నంది ఎల్లయ్య కోరారు. గత ఏడాది కూడా ఇలాగే సమావేశం పెట్టినా, అభివృద్ధి ఏమాత్రం జరగలేదని మరో ఎంపీ మల్లారెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై ఎంపీలు తమ సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతి ఏటా ఈ తరహాలో రైల్వే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపడానికి ముందుగా ప్రజాప్రతినిధులతో రైల్వే అధికారులు భేటీ కావడం తెలిసిందే. -
కడప రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా.. శనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. కపడ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించిన ఆయన.. అనంతరం రైల్వే కళ్యాణ మండపాన్ని, సోలార్ విద్యుత్ స్టేషన్ ను ప్రారంభించారు. కడప పర్యటన అనంతరం ఆయన కమలాపురం వెళ్లారు. -
హైదరాబాద్ శివార్లలో రెండు రైల్వే జంక్షన్లు
ఏర్పాటు చేయాలని రైల్వే శాఖకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి ♦ చర్లపల్లి, నాగులపల్లిలో జంక్షన్లను అభివృద్ధి చేయాలి ♦ ఢిల్లీ, చెన్నై, ముంబై మార్గాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి ♦ పేదల కోసం సికింద్రాబాద్‌లోని రైల్వే భూములు ఇవ్వండి ♦ రైల్వేకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని హామీ ♦ ముఖ్యమంత్రితో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైల్వే శాఖను కోరారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లపై ఒత్తిడి విపరీతంగా పెరిగినందున కొత్త జంక్షన్లు అవసరమని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని... దీనికి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయం లో సీఎం కేసీఆర్‌తో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, చెన్నై తదితర మార్గాలకు చర్లపల్లి జంక్షన్... ముంబై మార్గానికి నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటాయని రవీంద్ర గుప్తాకు సీఎం కేసీఆర్ చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో మరింత ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రవీంద్ర గుప్తా.. దీనిపై రైల్వే శాఖకు ప్రతిపాదనలను పంపుతామని చెప్పారు. చర్లపల్లిలో ఇప్పటికే రైల్వే శాఖకు కొంత భూమి ఉందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల ఏర్పాటుకు స్థలం లేదని... రైల్వే శాఖకు ఉన్న భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని కోరారు. దానికి బదులుగా మరో చోట రైల్వే శాఖకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీనికి కూడా జీఎం రవీంద్ర గుప్తా సానుకూలంగా స్పందించారు. క్రాసింగ్లకు గేట్లు పెట్టండి.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 చోట్ల కాపలాదారులు, గేట్లు లేని లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే జీఎంతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ఏడాది మాసాయిపేట దుర్ఘటనలో పిల్లలు మరణించడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాన్ని ప్రథమ ప్రాధాన్య అంశంగా గుర్తించి, దశల వారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లోని తుకారం గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
టైమ్ ప్రకారం బండి నడవడం లేదు
♦ ఎంఎంటీఎస్ రాకపోకల్లో జాప్యంపై ప్రయాణికుల అసంతృప్తి ♦ హైలైట్స్, రిస్తా యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదు ♦ గంటల తరబడి రైళ్లలో నిలబడే ప్రయాణిస్తున్నాం.. సీట్లు పెంచండి ♦ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల వెల్లువ ♦ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య పర్యటించిన రవీంద్ర గుప్తా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపోతున్నాం. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి ప్రయాణ సమయం నలభై నిమిషాలు. అయితే మరో నలభై నిమిషాలు ఆలస్యమవుతోంది. - హైటెక్‌సిటీలో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ నిపుణుడి ఆవేదన ఇదీ.. రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారం తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ యాప్ ఒక్కోసారి స్పందించడం లేదు. సరైన రైళ్ల సమాచారం లభించడం లేదు. - మరో ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఇదీ.. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘రిస్తా’ యాప్‌పై చాలామందికి అవగాహన లేక ఈ యాప్‌ను వినియోగించుకోలేకపోతున్నారు. దీనిపై అవగాహన కల్పించండి. - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వైపు ప్రయాణిస్తున్న యువతుల సూచన ఇదీ.. ఎంఎంటీఎస్ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు అందిన ఫిర్యాదులివీ. రవీంద్ర గుప్తా సోమవారం సికిం ద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ట్రైన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రద్దీ వేళల్లో అర గంట నుంచి 45 నిమిషాల వరకు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దీంతో ఎంఎంటీఎస్‌లను నమ్ముకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రయాణికులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణ సమయంలో గంటల తరబడి నిలబడాల్సి రావడంపై కొందరు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, రైళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వీసుల సంఖ్యను పెంచాలని సూచించారు. వేగంగా.. సురక్షితంగా నడుపుతాం: జీఎం ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు రవీంద్ర గుప్తా వివరించారు. ‘రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల 5 శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రయాణికులు ఎంఎంటీఎస్‌పైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. రైళ్ల వేగాన్ని పెంచుతాం. ఆలస్యానికి అవకాశం లేకుండా బండ్లు నడుపుతాం. హైలైట్స్, రిస్తా యాప్స్‌లో సాంకేతిక సమస్యలు తొలగించి ప్రయాణికులు సమర్థవంతంగా వినియోగించేలా విస్తృత ప్రచారం చేస్తాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులపై సమీక్షించి నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. - సాక్షి, హైదరాబాద్ -
ఏపీలో కొత్త రైల్వే లైన్లకు సహకరించండి
- రైల్వే జీఎంను కోరిన ముఖ్యమంత్రి సాక్షి, విజయవాడ బ్యూరో : ఏపీలో రోడ్డు కనెక్టివిటీకి సమాంతరంగా రైల్వే లైన్లను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఇందుకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పారిశ్రామిక అవసరాల కోసం ప్రస్తుత విశాఖ-చెన్నయ్ రైలు మార్గానికి అదనంగా డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కొత్త జీఎంగా బాధ్యతలు స్వీకరించిన గుప్తా శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లైన్లను సత్వరం పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్లు, మూడు నోడ్లు, రెండు మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు కొత్తగా ఏర్పాటవుతున్నాయని వాటి అవసరాలు తీర్చే విధంగా కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాల్సివుందన్నారు. అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలను హైదరాబాద్-బెంగుళూరు మార్గానికి అనుసంధానం చేస్తూ కొత్త రహదారి నిర్మాణం జరగనుందని ఇదే మార్గంలో రైల్వే లైను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, రుణాలు తీసుకోవడం ద్వారా కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలు చేపడదామని సీఎం ప్రతిపాదించారు. రైల్వే వ్యవస్థలో బూజుపట్టిన విధానాలను సమూలంగా మార్చేయాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త లైన్లు వేయాలన్నా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా దశాబ్దాల కాలం పడుతోందని, ఈ విధానాలను మార్చే సరికొత్త డైనమిజం రైల్వే శాఖకు అవసరమని అన్నారు. విశాఖ-చెన్నయ్, గూడూరు-తిరుపతి మార్గాల్లో మూడో లైను ఏర్పాటు, అమరావతి నుంచి రాయలసీమ జిల్లాల మీదుగా బెంగుళూరుకు కొత్త మార్గం ఏర్పాటు తదతర అంశాలపై తగిన ప్రతిపాదనలతో మరో 20 రోజుల్లో సమావేశమై చర్చిద్దామని తెలిపారు. రాజమహేంద్రవరంలో పురాతన హేవలాక్ బ్రిడ్జిని తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. లేనిపక్షంలో రైల్వే శాఖే వేలంలో దీన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని అభ్యంతరం లేదన్నారు. ఈ బ్రిడ్జిని హెరిటేజ్ చిహ్నంగా భావిస్తున్నామని, దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, సహాయ కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు.