గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అలాగే 9 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కారాల కోసం 500 ప్రత్యేక రైళ్లు, 2000 కోచ్లు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రవీంద్రగుప్తా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.