స్వర్ణోత్సవ సంరంభం దిశగా దక్షిణమధ్య రైల్వే
- 50 ఏళ్ల సందర్భంగా లోగో ఆవిష్కరణ
- సేవలు చరిత్రాత్మకం జీఎం రవీంద్రగుప్తా వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు సేవలందజేస్తూ గడచిన యాభై ఏళ్లలో దక్షిణమధ్య రైల్వే అనేక చరిత్రాత్మకమైన మైలు రాళ్లను అధిగమించిందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అన్నారు. 1966 అక్టోబర్ 2వ తేదీన ఆవిర్భవించిన ద.మ.రైల్వే జోన్ వచ్చే అక్టోబర్ 2 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా స్వర్ణోత్సవ లోగోను ఆయన శుక్రవారం రైల్‌నిలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో, ప్రయాణికులకు సముచితమైన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో దక్షిణమధ్య రైల్వే అగ్రపథంలో నిలిచిందన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ై రెల్ నిలయం ఎదుట ఏర్పాటు చేసిన సర్ అలెక్ స్టీమ్ ఇంజన్ జోన్ వారసత్వ సంపదకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్‌లకు జోన్ విస్తరించి ఉందన్నారు.
ప్రయాణికులకు ‘స్వచ్ఛ’ సేవలు
ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ‘స్వచ్ఛ సప్తాహ్’ లో భాగంగా అన్ని రైల్వేస్టేషన్‌లు, రైళ్లు, ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలి పారు. ప్లాట్‌ఫామ్‌లపై 2,751మంది, రైళ్లలో 1,591 మంది ప్రయాణికులతో పరిశుభ్రతపై మాట్లాడి సలహాలను తీసుకున్నామన్నారు. పరి సరాలను అపరిశుభ్రం చేసిన 3,764 మంది ప్రయాణికులకు రూ.7.51 లక్షల జరిమానా విధిం చినట్లు పేర్కొన్నారు. ‘స్వచ్ఛ సప్తాహ్’లో రైల్వే అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు.