రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి | Dattatreya and TRS leaders requested to Suresh Prabhu | Sakshi
Sakshi News home page

రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి

Published Wed, Aug 2 2017 12:13 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి

రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి

కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభును కోరిన దత్తాత్రేయ, టీఆర్‌ఎస్‌ నేతలు
- వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాట్లాడిన ప్రభు
త్వరితగతిన రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశం
 
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ పరిధిలోని లాలా పేట్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 12.6 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన ప్రక్రియను వేగ వంతం చేయాలని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. రాష్ట్ర మంత్రి పద్మారావు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కె.కవిత, సీతారాంనాయక్, మల్లా రెడ్డి తదితరులు మంగళవారం ప్రభును పార్ల మెంటులో కలిశారు. ఈ సందర్భంగా భూమి బదలాయింపు ప్రక్రియ పురోగతిపై చర్చించారు. గతంలో సికింద్రాబాద్‌ పరిధిలో రైల్వే భూమిని బదలాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తిపై సురేశ్‌ ప్రభు సానుకూలంగా స్పందించారు.

అయితే భూమి బదలాయింపు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సంబం« దిత ప్రాంతంలో పేదలకు 4 వేల వరకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుకు టీఆర్‌ఎస్‌ నేతలు వివరించారు. రైల్వే భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట భూమి ఇచ్చేందుకు, లేదా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్పందించిన ప్రభు.. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడి భూమి బదలా యింపు ప్రక్రియకు సంబంధించిన నివేదికను త్వరితగతిన తయారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప గించాలని సూచించారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం సందర్భంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని రైల్వే సమస్యలను ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎం అధ్యక్షతన ఎంపీలు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement