విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ నుంచి ధర్మవరం మధ్య ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు విజయవాడ నుంచి అనంతపురం మీదుగా ధర్మవరానికి వారానికి మూడు రోజులు నడుస్తుంది.